Share News

పులివెందులలో అన్ని చోట్లా రీపోలింగ్‌ పెట్టాలి

ABN , Publish Date - Nov 03 , 2026 | 06:08 AM

రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) నిర్ణయించిన నాలుగు వార్డుల్లోనే కాకుండా పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో రీపోలింగ్‌ నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వైసీపీ చైర్మన్‌ అభ్యర్థి వైఎస్‌ ప్రమీల, ఎంపీ అవినాశ్‌రెడ్డి వేసిన అనుబంధ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది.

పులివెందులలో అన్ని చోట్లా రీపోలింగ్‌ పెట్టాలి

  • కోర్టు నిర్ణయం తీసుకునే వరకు కౌంటింగ్‌ ఆపాలి

  • వైఎస్‌ ప్రమీల, ఎంపీ అవినాశ్‌ అనుబంధ పిటిషన్‌

  • నేటి ఉదయం 7.30కు హైకోర్టు నిర్ణయం

అమరావతి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) నిర్ణయించిన నాలుగు వార్డుల్లోనే కాకుండా పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో రీపోలింగ్‌ నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వైసీపీ చైర్మన్‌ అభ్యర్థి వైఎస్‌ ప్రమీల, ఎంపీ అవినాశ్‌రెడ్డి వేసిన అనుబంధ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలు ముగియడంతో మంగళవారం ఉదయం 7.30కు నిర్ణయం ప్రకటిస్తామని న్యాయస్థానం తెలిపింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మండవ కిరణ్మయి శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తగిన ముందస్తు రక్షణ చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ ప్రమీల, అవినాశ్‌రెడ్డి హైకోర్టులో అత్యవసర పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి.. ఎంపీ అవినాశ్‌రెడ్డి గత నెల 26న ఇచ్చిన వినతిపై తగిన నిర్ణయం తీసుకోవాలని ఎస్‌ఈసీని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, అధికార పార్టీ నేతలు బూత్‌లు ఆక్రమించి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని, సీసీటీవీ ఫుటేజ్‌, వెబ్‌ కాస్టింగ్‌, ఇతర ఆధారాలను పరిగణనలోకి తీసుకుని ఎస్‌ఈసీ నిర్ణయించిన 4 వార్డుల్లోనే కాకుండా మిగతా వార్డులన్నింటిలో రీపోలింగ్‌ నిర్వహించేలా ఎస్‌ఈసీని ఆదేశించాలని కోరుతూ అనుబంధ పిటిషన్‌ వేశారు. మంగళవారం జరగనున్న కౌంటింగ్‌ ప్రక్రియను నిలిపివేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ అనుబంధ పిటిషన్‌ సోమవారం విచారణకు రాగా పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌. శ్రీరామ్‌ వాదనలు వినిపించారు.


ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవడంలో ఎస్‌ఈసీ విఫలమైందన్నారు. మొత్తం 70 బూత్‌లలో వైసీపీ పోలింగ్‌ ఏజెంట్లు లేకుండా బయటకు నెట్టివేశారని తెలిపారు. బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని, ఎన్నికల జరుగుతున్న సమయంలోనే వీడియో ఆధారాలతో ఎస్‌ఈసీకి అనేక ఫిర్యాదులు చేశామని వివరించారు. వాటిని పరిశీలించకుండానే, అధికారుల నివేదిక ఆధారంగా కేవలం నాలుగు వార్డుల్లో మాత్రమే రీపోలింగ్‌కు ఎస్‌ఈసీ ఆదేశించిందన్నారు. సీసీటీవీ ఫుటేజ్‌, వెబ్‌ కాస్టింగ్‌, పిటిషనర్లు సమర్పించిన వీడియో ఆధారాలను పరిశీలించి రీపోలింగ్‌పై నిర్ణయం తీసుకొనేలా ఎస్‌ఈసీని ఆదేశించాలని కోరారు.

అన్నీ పరిశీలించాకే: ఎస్‌ఈసీ

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌(ఎస్ఈసీ) తరఫున న్యాయవాది అశ్వినీకుమార్‌ వాదనలు వినిపిస్తూ.. పోలింగ్‌ ముగిసిన అనంతరం జిల్లా కలెక్టర్‌, ఎస్పీ నుంచి నివేదిక తెప్పించుకున్నామని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఫిర్యాదులను పరిశీలించామని చెప్పారు. క్షేత్రస్థాయిలో అధికారుల నుంచి తెప్పించుకున్న నివేదికలు, అభ్యర్థుల ఫిర్యాదులను పరిశీలించిన తర్వాతే 4 వార్డుల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని ఎస్‌ఈసీ నిర్ణయించిందన్నారు. సోమవారం జరిగిన రీపోలింగ్‌లో ఎలాంటి ఫిర్యాదులు అందలేదని తెలిపారు. ప్రధాన వ్యాజ్యంలో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా పిటిషనర్ల వినతిపై ఎస్‌ఈసీ నిర్ణయం వెల్లడించిందన్నారు. పోలింగ్‌ సందర్భంగా తీసుకున్న ముందస్తు రక్షణ చర్యలపై వివరాలను ఎంపీకి ఈ-మెయిల్‌ చేసినట్టు పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి

Updated Date - Nov 03 , 2026 | 06:13 AM