సుప్రీంకోర్టు ఉత్తర్వులు మా ముందుంచండి
ABN , Publish Date - Oct 08 , 2026 | 04:52 AM
విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం వ్యవహారంలో ముడిపడి ఉన్న కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తమముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం, పిటిషనర్‌ను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
సాయికృష్ణ అదృశ్యం వ్యవహారంలో హైకోర్టు ఆదేశం
అమరావతి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం వ్యవహారంలో ముడిపడి ఉన్న కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తమముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం, పిటిషనర్‌ను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. పిల్‌పై విచారణ జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ వార్తలనూ చదవండి..