దంచికొట్టిన వాన
ABN , Publish Date - Oct 17 , 2026 | 05:45 AM
శుక్రవారం ఉదయం నుంచే నల్లటి మేఘాలు తిరుమలను కప్పేశాయి. ఉదయం మోహినీ అవతార వాహన సేవకు వచ్చిన భక్తులు సాయంత్రం గరుడ సేవను తిలకించడం కోసం గ్యాలరీల్లోనే కూర్చుండిపోయారు.
శుక్రవారం ఉదయం నుంచే నల్లటి మేఘాలు తిరుమలను కప్పేశాయి. ఉదయం మోహినీ అవతార వాహన సేవకు వచ్చిన భక్తులు సాయంత్రం గరుడ సేవను తిలకించడం కోసం గ్యాలరీల్లోనే కూర్చుండిపోయారు. మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 గంటల వరకు భారీ వర్షం కురిసింది. గ్యాలరీల్లోని భక్తులు వర్షాన్ని లెక్కచేయకుండా ఎక్కడివారక్కడే ఉండిపోయారు. ఆ తర్వాత వర్షం జోరుతగ్గినప్పటికీ చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. దీంతో ఘటాటోపం నీడలో గరుడ వాహనసేవ నెమ్మదిగా ముందుకుసాగింది.
మరోవైపు టీటీడీ ఊహించినంత రద్దీ కనిపించలేదు. దసరా సెలవులు, పెరటాశి మాసం చివరి వారం కావడంతో భక్తులు భారీగా వస్తారని అంచనా వేసిన టీటీడీ అందుకు తగ్గ ఏర్పాట్లు చేసింది. కానీ స్థానిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభంతో పాటు వర్ష సూచనల నేపథ్యంలో మాడవీధుల్లోని గ్యాలరీలు భక్తులతో నిండాయి. సాధారణంగా మఽధ్యాహ్నం 3 గంటలకే మూతపడే గ్యాలరీ గేట్లు తెరుచుకునే ఉండడం గమనార్హం.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు