మరోసారి ఉప్పొంగిన బాహుదా
ABN , Publish Date - Nov 21 , 2026 | 04:57 AM
అక్వాన్ ప్రభావంతో ఎగువ ప్రాంతాలతో పాటు ఒడిశాలో కురిసిన భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని బాహుదా నదిలోకి పెద్దఎత్తున వరద నీరు చేరింది.
ఇచ్ఛాపురం, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): అక్వాన్ ప్రభావంతో ఎగువ ప్రాంతాలతో పాటు ఒడిశాలో కురిసిన భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని బాహుదా నదిలోకి పెద్దఎత్తున వరద నీరు చేరింది. ఒక దశలో ప్రవాహం 40వేల క్యూసెక్కులకు చేరడంతో నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గత అనుభవాల దృష్ట్యా ముంపు ప్రాంతాల్లో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. మొత్తానికి వర్షాలు తగ్గి, వరద ప్రవాహం క్రమంగా దిగిరావడంతో ముప్పు తప్పింది.
ఈ వార్తలనూ చదవండి:
వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!
ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..