Share News

మళ్లీ పెరిగిన ఎండ

ABN , Publish Date - Sep 27 , 2026 | 03:26 AM

వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలో పలుచోట్ల మళ్లీ ఎండలు పెరిగాయి. శనివారం ఆకాశం నిర్మలంగా ఉండడంతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.

మళ్లీ పెరిగిన ఎండ

  • తిరుపతిలో 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత

విశాఖపట్నం, అమరావతి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలో పలుచోట్ల మళ్లీ ఎండలు పెరిగాయి. శనివారం ఆకాశం నిర్మలంగా ఉండడంతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. తిరుపతిలో అత్యధికంగా 38.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రత కారణంగా వాతావరణ అనిశ్చితి నెలకొని అక్కడక్కడ వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని ఎక్కువ ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుందని, అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, ఆదివారం పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, అల్లూరి, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వివరించింది. కాగా, మూడు రోజుల క్రితం తీరం దాటిన తీవ్ర వాయుగుండం ఉత్తర ఈశాన్యంగా పయనించే క్రమంలో వాయుగుండంగా మారి శనివారం మధ్యాహ్నం ఉత్తరప్రదేశ్‌, ఉత్తర ఛత్త‌ీస్‌గఢ్‌ పరిసరాల్లో కొనసాగింది. శనివారం రాత్రికి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది.

ఈ వార్తలనూ చదవండి:

మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు

పర్యాటకం జోరు

Updated Date - Sep 27 , 2026 | 03:26 AM