రోడ్డుపై చెత్త వేసినందుకు కొరడా
ABN , Publish Date - Oct 10 , 2026 | 05:02 AM
నగరంలో పారిశుధ్యానికి విఘాతం (చెత్తను రోడ్లపై పడేయడం) కలిగించేలా వ్యవహరిస్తున్న దుకాణాలపై జీవీఎంసీ అధికారులు కొరడా ఝళిపించారు. గురువారం నగరవ్యాప్తంగా స్పెషల్‌డ్రైవ్ నిర్వహించి బహిరంగ ప్రదేశాల్లో ...
విశాఖలో 58 దుకాణాలు సీజ్.. రూ.4.36 లక్షలు జరిమానా
విశాఖపట్నం, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): నగరంలో పారిశుధ్యానికి విఘాతం (చెత్తను రోడ్లపై పడేయడం) కలిగించేలా వ్యవహరిస్తున్న దుకాణాలపై జీవీఎంసీ అధికారులు కొరడా ఝళిపించారు. గురువారం నగరవ్యాప్తంగా స్పెషల్‌డ్రైవ్ నిర్వహించి బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తున్న 58 దుకాణాలను సీజ్ చేసి, రూ.4.36 లక్షలు జరిమానా విధించారు. భీమిలి జోన్‌లో రెండు దుకాణాలను సీజ్ చేసి రూ.40 వేలు జరిమానా విధించారు.
మధురవాడ జోన్‌లో 16 దుకాణాలు సీజ్ చేసి రూ.94 వేలు, ఈస్ట్‌జోన్ పరిధిలో 14 దుకాణాలను సీజ్ చేసి రూ.43 వేలు, నార్త్‌జోన్ పరిధిలో ఎనిమిది దుకాణాలను సీజ్ చేసి రూ.55,500 జరిమానా విధించారు. అదేవిధంగా సౌత్ జోన్ పరిధిలో రెండు దుకాణాలను సీజ్ చేసి రూ.58,500, వెస్ట్ జోన్ పరిధిలో ఐదు దుకాణాలను సీజ్ చేసి రూ.37,500, అగనంపూడి జోన్‌లో ఒక దుకాణం సీజ్ చేసి రూ.15 వేలు, అనకాపల్లి జోన్‌లో నాలుగు దుకాణాలు సీజ్ చేసి రూ.22,500 జరిమానా విధించారు. జరిమానా చెల్లించిన తరువాత తిరిగి దుకాణం తెరిచేందుకు అనుమతి ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. చెత్త వేసేందుకు డస్ట్‌బిన్‌లు ఏర్పాటుచేయకపోవడంతో మరో 22 దుకాణాల నిర్వాహకులకు కూడా జరిమానాలు విధించారు. నగరంలో చెత్తను రోడ్లపై పడేస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ కేతన్‌గార్గ్ హెచ్చరించారు. ఆయన స్వయంగా అల్లిపురంలోని ఒక దుకాణాన్ని సీజ్ చేసి రూ.25 వేలు జరిమానా విధించారు.
ఈ వార్తలనూ చదవండి:
సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు