టీడీపీలో రెబెల్ సినిమా ఆడదు
ABN , Publish Date - Sep 22 , 2026 | 06:22 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో రెబెల్ సినిమా ఆడదని అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వ్యాఖ్యానించారు.
అడ్డుకాలు వేస్తే కనుమరుగైపోతారు
గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు హెచ్చరిక
గుంతకల్లు, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో రెబెల్ సినిమా ఆడదని అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వ్యాఖ్యానించారు. పార్టీలో ఎవరైనా రెబెల్ అంటూ అడ్డుకాలు పెట్టాలని చూస్తే కనుమరుగైపోతారని, అడ్రస్ లేకుండా పోతారని హెచ్చరించారు. గుంతకల్లులోని ఓ ఫంక్షన్ హాలులో సోమవారం జరిగిన టీడీపీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. పనిచేసినవారికి పదవులు లభిస్తాయని, లభించనివారికి ఎన్నికల తర్వాత తగిన న్యాయం జరుగుతుందని అన్నారు. మాజీ మంత్రి, స్థానిక సంస్థల ఎన్నికల ఇన్‌చార్జి ఏరాసు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ, గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన జగన్‌కు ఇంకా తెలివిరాలేదని, అందుకే శవరాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఐదేళ్లూ దోచుకుని, దాచుకున్న వారికి, రప్పారప్పా అంటూ గొంతులు కోస్తామన్న వారికి ఈ ఎన్నికల్లో డిపాజిట్లు రానివిధంగా ఓటర్లు బుద్ధి చెప్పాలని కోరారు. జగన్ మైనార్టీల ద్రోహి అని, మైనార్టీల సంరక్షకుడు చంద్రబాబు నాయుడేనని అన్నారు.
ఈ వార్తలనూ చదవండి....
‘హామీల అమలుకు చర్యలు తీసుకోండి’
ఆర్‌వీ నగర్ కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్సవాలకు సీఎం రాక