మద్యం మత్తులో ఘాతుకం
ABN , Publish Date - Sep 27 , 2026 | 03:35 AM
మద్యం మత్తులో మానవత్వాన్ని మరిచాడు! సొంత అమ్మమ్మపైనే పెట్రోలు పోసి నిప్పంటించి హతమార్చాడు ఆమె మనవడు. ఈ దారుణ ఘటన మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం పెద్దబొమ్మలాపురం గ్రామంలో చోటుచేసుకుంది.
అమ్మమ్మపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మనవడు..
వృద్ధురాలు మృతి.. మార్కాపురం జిల్లాలో ఘటన
పెద్దదోర్నాల, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో మానవత్వాన్ని మరిచాడు! సొంత అమ్మమ్మపైనే పెట్రోలు పోసి నిప్పంటించి హతమార్చాడు ఆమె మనవడు. ఈ దారుణ ఘటన మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం పెద్దబొమ్మలాపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఎర్రగొండపాలెం సీఐ అజయ్‌కుమార్ కథనం మేరకు.. పెద్దబొమ్మలాపురం గ్రామానికి చెందిన పసుపులేటి లక్ష్మమ్మ (81)కు ముగ్గురు కుమార్తెలున్నారు. రెండో కుమార్తె, అల్లుడు, వారి కుమారుడు మట్టుపల్లి రాములు, అతని భార్య అందరూ లక్ష్మమ్మ వద్దే ఉంటున్నారు. మద్యానికి బానిసైన రాములు తరచూ తల్లిదండ్రులు, భార్యతో గొడవపడుతుండేవాడు. దీంతో అతని భార్య కొంతకాలం క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో రాములు శుక్రవారం రాత్రి ఫూటుగా మద్యం సేవించి వచ్చి తల్లిదండ్రులు, అమ్మమ్మతో గొడవ పడ్డాడు. వాళ్లపై రాళ్లు విసిరాడు. దీంతో తల్లిదండ్రులు బంధువుల ఇంటికి వెళ్లి తలదాచుకున్నారు. అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా ఉన్న అమ్మమ్మ లక్ష్మమ్మపై రాములు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆ వృద్ధురాలు మృతిచెందింది.
ఈ వార్తలనూ చదవండి:
మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు