టీబీ.. సామాజిక సవాల్: గవర్నర్
ABN , Publish Date - Oct 08 , 2026 | 05:23 AM
‘టీబీ కేవలం వైద్యపరమైన సవాలు మాత్రమే కాదు. వ్యక్తులు, కుటుంబాలు, సమాజాలపై ప్రభావం చూపే సామాజిక, ఆర్థిక సవాలు’ అని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు.
అమరావతి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): ‘టీబీ కేవలం వైద్యపరమైన సవాలు మాత్రమే కాదు. వ్యక్తులు, కుటుంబాలు, సమాజాలపై ప్రభావం చూపే సామాజిక, ఆర్థిక సవాలు’ అని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. లోక్‌భవన్ దర్బార్ హాల్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో అంధ్రప్రదేశ్ టీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న ఎస్.అబ్దుల్ నజీర్ 77వ టీబీ సీల్(స్టాంపు) విక్రయ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘144 ఏళ్ల క్రితం సర్ రాబర్ట్ కోచ్ క్షయ వ్యాధి కారకక్రిమిని కనుగొన్నారు. దీని నియత్రణకు గణనీయమైన పురోగతి సాధించాం. అయితే ఇది ఇప్పటికే ప్రాణాంతక వ్యాధిగానే కొనసాగుతోంది’ అని ఆయన అన్నారు.
ఈ వార్తలనూ చదవండి..