వ్యసనాలకు బానిసై దొంగగా మారిన ప్రభుత్వ ఉద్యోగి..
ABN , Publish Date - Feb 25 , 2026 | 05:46 PM
తిరువూరు రూరల్ మండలం చిక్కుళ్లగూడెం గ్రామంలో జరిగిన చోరీ కేసును పోలీసులు చేదించారు. చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేశారు.
ఎన్టీఆర్ జిల్లా, ఫిబ్రవరి 24: తిరువూరు రూరల్ మండలం చిక్కుళ్లగూడెం గ్రామంలో జరిగిన చోరీ కేసును పోలీసులు చేదించారు. చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడిని విజయవాడకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి (అసిస్టెంట్ లైన్‌మెన్) నంద సుభాష్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నంద సుభాష్ చెడు వ్యసనాలకు బానిసై నేరాలకు పాల్పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే తిరువూరు మండలం గానుగపాడు గ్రామంలో బైక్ చోరీ చేశాడు.
దొంగిలించిన బైక్‌పైనే వృద్ధురాలైన ఉప్పు అనసూర్య మెడలో 40 గ్రాముల బంగారు నాన్తాడు చైన్‌ను లాక్కెళ్లిపోయాడు. తిరువూరు సీఐ కే. గిరిబాబు నిందితుడిని లక్ష్మీపురం శివారులో అరెస్టు చేశారు. దొంగిలించిన బంగారంతో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
పాఠ్యాంశం తొలగిస్తాం.. సుప్రీం సీరియస్‌పై కేంద్రం
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో రూ. 590 కోట్ల మోసం.. వెలుగులోకి సంచలన విషయాలు..