6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు పట్టివేత
ABN , Publish Date - Oct 27 , 2026 | 05:08 AM
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని రుస్తుంబాదా చెక్ పోస్టు వద్ద సోమవారం కారులో తరలిస్తున్న సుమారు రూ.6కోట్ల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు పట్టుకున్నారు.
బిల్లులు చూపడంతో వ్యాపారికి అప్పగింత
నరసాపురం, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని రుస్తుంబాదా చెక్ పోస్టు వద్ద సోమవారం కారులో తరలిస్తున్న సుమారు రూ.6కోట్ల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు పట్టుకున్నారు. విజయవాడ నుంచి నరసాపురంలోని బంగారు దుకాణాలకు వీటిని తీసుకొస్తున్నారు. రొటీన్‌గా చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులు కారులో బాక్స్‌లు ఉండటాన్ని గుర్తించారు. వెంటనే ఆధికారులకు సమాచారం ఇచ్చారు. సరైన బిల్లులు చూపించకపోవడంతో సుమారు 3కేజీల 600గ్రాముల బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పట్టుబడిన బంగారానికి సంబంధించిన బిల్లుల్ని సాయంత్రం విజయవాడ నుంచి రప్పించారు. వాటిని ఎన్నికల అధికారులకు చూపించారు. దీంతో ఆ వస్తువుల్ని అప్పగించారు.
ఈ వార్తలనూ చదవండి:
బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అర్నబ్’
అతి తీవ్ర తుఫాను..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్