Share News

ఉధృతంగా గోదావరి

ABN , Publish Date - Sep 29 , 2026 | 04:07 AM

రెండు రోజులుగా ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరికి వరద మరింత పెరిగింది. దీంతో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లను పూర్తిగా పైకెత్తి 9.69 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద సాధారణ నీటిమట్టం 10.90 అడుగులు కాగా, సోమవారం 11.60 అడుగులకు చేరింది.

ఉధృతంగా గోదావరి

  • ధవళేశ్వరం బ్యారేజీ వద్ద పెరిగిన నీటిమట్టం

  • సముద్రంలోకి 9.69 లక్షల క్యూసెక్కుల వరద

  • పౌర్ణమి కావడంతో సముద్రంలో పోటు

  • నెమ్మదించిన ప్రవాహం.. మునుగుతున్న లంక గ్రామాలు

  • శాంతించిన శబరి.. ఒడిశాకు రాకపోకలు పునరుద్ధరణ

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): రెండు రోజులుగా ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరికి వరద మరింత పెరిగింది. దీంతో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లను పూర్తిగా పైకెత్తి 9.69 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద సాధారణ నీటిమట్టం 10.90 అడుగులు కాగా, సోమవారం 11.60 అడుగులకు చేరింది. నీటిమట్టం 11.75 అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. పౌర్ణమి కావడంతో సముద్రం పోటు మీద ఉండడం వల్ల దిగువన వరద ప్రవాహం నెమ్మదించింది. దీంతో కోనసీమ జిల్లాలో లంకగ్రామాలు మునుగుతున్నాయి. పి.గన్నవరం మండలం చాకలిపాలెం వద్ద కనకాయలంక కాజ్‌ వేపైకి వరదనీరు రావడంతో స్థానిక లంకగ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలం వద్ద నీటిమట్టం 42.70 అడుగులకు చేరింది. పోలవరం ప్రాజెక్టు వద్ద నీటిమట్టం స్పల్పంగా తగ్గింది. ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి 9,39,418 క్యూసెక్కుల వరద జలాలను దిగువకు విడుదల చేసినట్టు డీఈ వెంకటేశ్వరరావు తెలిపారు.

ప్రాజెక్టు ఎగువ కాఫర్‌ డ్యామ్‌కు ఎగువన 33.300 మీటర్లు, స్పిల్‌వే ఎగువన 33.200 మీటర్లు నీటిమట్టం నమోదైంది. ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు మండలంలో పంట పొలాలు వరద ముంపులోనే ఉన్నాయి. వేలేరుపాడు-కోయిదా, వేలేరుపాడు-రుద్రమ్మకోట రోడ్లు ముంపులోనే ఉండటంతో 24 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాగా, శబరి నది కాస్త శాంతించింది. ఐదు రోజుల కిందట చింతూరు వద్ద 43 అడుగులు ఉన్న శబరి నీటిమట్టం క్రమంగా తగ్గుతూ సోమవారం 30.5 అడుగులకు చేరింది. మన రాష్ట్రం మీదుగా ఒడిశాకు వెళ్లే 326 జాతీయ రహదారిపై కుయుగూరు వాగు వంతెనపై వరద తగ్గడంతో వరద వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. అయితే, సోకిలేరు వాగు చప్టాపై వరద ఇంకా తగ్గకపోవడంతో చింతూరు వరరా మచంద్రపురం మండలాల నడుమ రాకపోకలను ఇంకా పునరుద్ధరించలేదు.

ఈ వార్తలనూ చదవండి...

పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. అక్టోబర్‌ 1న ఉదయం 6:30 నుంచే పింఛన్ల పంపిణీ

పీఎం కిసాన్ 24వ విడత.. రైతులు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే..

Updated Date - Sep 29 , 2026 | 04:07 AM