Share News

కస్తుర్బా హాస్టల్‌లో పాము కాటుతో విద్యార్థిని మృతి.. ‌స్టాఫ్‌పై సస్పెన్షన్ వేటు..

ABN , Publish Date - Apr 12 , 2026 | 07:24 PM

కస్తుర్బా గాంధీ హాస్టల్‌లో విద్యార్థిని పాము కాటుకు గురై చనిపోయిన ఘటనకు సంబంధించి ఐదుగురిపై సస్పెన్షన్ వేటు పడింది. కస్తూర్బా స్కూల్ ప్రిన్సిపల్‌ ఉమాదేవి, ఇద్దరు టీచర్లు, వాచ్‌ ఉమెన్‌, ఏఎన్ఎమ్ ఈశ్వరిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

కస్తుర్బా హాస్టల్‌లో పాము కాటుతో విద్యార్థిని మృతి.. ‌స్టాఫ్‌పై సస్పెన్షన్ వేటు..
Anakapalli snake bite case

అనకాపల్లి, ఏప్రిల్ 12: జిల్లాలోని అచ్యుతాపురం కస్తుర్బా గాంధీ హాస్టల్‌లో విద్యార్థిని పాము కాటుకు గురై చనిపోయిన ఘటనకు సంబంధించి ఐదుగురిపై సస్పెన్షన్ వేటు పడింది. హాస్టల్ ఘటనపై ఆర్డీఓ అయేషా ఇచ్చిన నివేదిక మేరకు కస్తూర్బా స్కూల్ ప్రిన్సిపాల్‌ ఉమాదేవి, ఇద్దరు టీచర్లు, వాచ్‌ ఉమెన్‌, ఏఎన్ఎమ్ ఈశ్వరిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కాగా, శుక్రవారం అర్థరాత్రి ఏడో తరగతి చదువుతున్న నవ్య హాస్టల్‌లో నిద్రపోతున్న సమయంలో పాము కుట్టింది. నిద్రలో తనను ఏదో కుట్టిందని నవ్య తోటి విద్యార్థులతో పాటు సిబ్బందికి చెప్పింది.


హాస్టల్ సిబ్బంది ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆగ్రహానికి గురైన బాలిక కుటుంబసభ్యులు హాస్టల్ వద్ద ఆందోళనకు దిగారు. హాస్టల్‌లో పాముల బెడద ఎక్కువగా ఉందని, పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఘటనపై సీరియస్ అయ్యారు. నివేదిక ఇవ్వాలని ఆర్డీఓను ఆదేశించారు. ఆర్డీఓ ఇచ్చిన నివేదిక ఆధారంగా కస్తూర్బా స్కూల్ ప్రిన్సిపల్‌ ఉమాదేవి, ఇద్దరు టీచర్లు, వాచ్‌ ఉమెన్‌, ఏఎన్ఎమ్ ఈశ్వరిని సస్పెండ్ చేశారు.


ఇవి కూడా చదవండి

ఐపీఎల్ 2026: గిల్, బట్లర్ హాఫ్ సెంచరీలు.. లఖ్‌నవూపై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం

వడగాలుల అలర్ట్.. ఏపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు

Updated Date - Apr 12 , 2026 | 08:22 PM