గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారిగా గంగాధర్
ABN , Publish Date - Sep 24 , 2026 | 07:15 AM
గోదావరి పుష్కరాలకు ప్రత్యేక అధికారిగా ఇప్పటికే ప్రభుత్వం మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్‌ను నియమించింది.
అమరావతి, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): గోదావరి పుష్కరాలకు ప్రత్యేక అధికారిగా ఇప్పటికే ప్రభుత్వం మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్‌ను నియమించింది. ఇప్పుడు.. ఆయనతో పాటు పోలీస్ శాఖ నుంచి ఐపీఎస్ అధికారి, సీఐడీ ఎస్పీ రెడ్డి గంగాధర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.