Share News

‘అక్షరం అండ’తో... స్పోర్ట్పు కాంప్లెక్స్‌కు మోక్షం

ABN , Publish Date - Oct 06 , 2026 | 05:16 AM

‘అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా’ పేరుతో ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన చర్చా వేదికలో ప్రస్తావించిన సమస్యకు ఎట్టకేలకు మోక్షం లభించింది. విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధిలోని క్రీడాకారులకు మంచి వేదిక అందుబాటులోకి వచ్చింది.

‘అక్షరం అండ’తో... స్పోర్ట్పు కాంప్లెక్స్‌కు మోక్షం

  • ‘ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి’ చర్చా వేదికలో సమస్యను ప్రస్తావించిన స్థానికులు

  • నిధులిచ్చిన ప్రజాప్రతినిధులు.. నిర్మాణం పూర్తిచేసిన అధికారులు

  • కాంప్లెక్స్‌ను ప్రారంభించిన ఎంపీ శ్రీభరత్‌, ఎమ్మెల్యే పల్లా

కూర్మన్నపాలెం, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): ‘అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా’ పేరుతో ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన చర్చా వేదికలో ప్రస్తావించిన సమస్యకు ఎట్టకేలకు మోక్షం లభించింది. విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధిలోని క్రీడాకారులకు మంచి వేదిక అందుబాటులోకి వచ్చింది. జీవీఎంసీ 87వ వార్డు సిద్ధార్థనగర్‌లో రూ.1.56 కోట్లతో నిర్మించిన స్పోర్ట్సు కాంప్లెక్స్‌ను ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్‌, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సోమవారం రాత్రి ప్రారంభించారు. గత ఏడాది జనవరి 28న వడ్లపూడి ఆర్యవైశ్య సామాజిక భవనంలో ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ‘అక్షరం అండగా....పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా సిద్ధార్థనగర్‌లో నిలిచిపోయిన స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను పూర్తిచేయాలని స్థానికులు అడిగారు. దీనిపై ప్రజాప్రతినిధులు స్పందించి నిధులు విడుదల చేయడంతో అధికారులు స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఎంపీ శ్రీభరత్‌ తన ఎంపీ ల్యాడ్స్‌ నుంచి రూ.20 లక్షలు కేటాయించడంతో ఈ కాంప్లెక్స్‌లో షటిల్‌ బాడ్మింటన్‌, కబడ్డీ కోర్టులు కూడా ఏర్పాటు చేశారు.


దీంతో స్థానికులు ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’కి కృతజ్ఞతలు తెలిపారు. స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభకు అధ్యక్షత వహించిన వార్డు మాజీ కార్పొరేటర్‌ బొండా జగన్‌ మాట్లాడుతూ స్పోర్ట్పు కాంప్లెక్స్‌ నిర్మాణాన్ని శరవేగంగా పూర్తిచేసి, ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఎంపీ శ్రీభరత్‌ మాట్లాడుతూ క్రీడాకారులకు సౌలభ్యంగా కాంప్లెక్స్‌ను తీర్చిదిద్దామన్నారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ప్రారంభంతో ఉక్కు నిర్వాసితుల చిరకాల కోర్కె నెరవేరిందన్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో 100 శాతం విజయం సాధించేలా కృషిచేయాలన్నారు. గాజువాకను రూ.250 కోట్లతో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దామన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ కోన తాతారావు, టీడీపీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్‌ గొర్లె వెంకునాయుడు, నేతలు ఎస్‌ఎస్‌ విజయరామరాజు, నల్లూరు సూర్యనారాయణ, బొట్టా ప్రకాశ్‌, కళ్లేపల్లి శ్రీనివాస వర్మ పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్

ఏపీలో నాలుగు కొత్త పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

Updated Date - Oct 06 , 2026 | 05:16 AM