Share News

పోలీస్‌ ఉద్యోగాల కోసం మైనార్టీలకు ఉచిత శిక్షణ

ABN , Publish Date - Sep 22 , 2026 | 05:42 AM

రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుల్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ల నియామకాల కోసం నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో మైనార్టీ నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ వెల్లడించారు.

పోలీస్‌ ఉద్యోగాల కోసం మైనార్టీలకు ఉచిత శిక్షణ

30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు గడువు: మంత్రి ఫరూక్‌

అమరావతి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుల్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ల నియామకాల కోసం నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో మైనార్టీ నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ వెల్లడించారు. మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సెంటర్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ డవల్‌పమెంట్‌ ఆఫ్‌ మైనార్టీస్(సీఈడీఎం) ద్వారా ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ విధానంలో శిక్షణ ఇవ్వనున్నట్టు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా www.apcedmmwd.org లో నమోదు చేసుకోవాలని కోరారు. వివరాలకు 08645-297535, 7386789966లకు సంప్రదించాలని కోరారు.

ఈ వార్తలనూ చదవండి....

‘హామీల అమలుకు చర్యలు తీసుకోండి’

ఆర్‌వీ నగర్‌ కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్సవాలకు సీఎం రాక

Updated Date - Sep 22 , 2026 | 05:42 AM