Share News

వంద అడుగుల లోయలో పడిన కారు

ABN , Publish Date - Sep 30 , 2026 | 04:59 AM

సీలేరు, డొంకరాయి, పొల్లూరు జలపాతాన్ని వీక్షించేందుకు విహార యాత్రకు బయల్దేరిన నలుగురు యువకులు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి 100 అడుగుల లోయలో పడడంతో గాయాలపాలయ్యారు.

వంద అడుగుల లోయలో పడిన కారు

  • గాయాలతో బయటపడిన నలుగురు యువకులు

  • పొల్లూరు జలపాతానికి వెళ్తుండగా ఘటన

మోతుగూడెం, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): సీలేరు, డొంకరాయి, పొల్లూరు జలపాతాన్ని వీక్షించేందుకు విహార యాత్రకు బయల్దేరిన నలుగురు యువకులు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి 100 అడుగుల లోయలో పడడంతో గాయాలపాలయ్యారు. పోలవరం జిల్లా చింతూరు మండలం పొల్లూరు ఎగువ జలపాతం వద్ద మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. మోతుగూడెం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విజయవాడ సమీపంలోని గన్నవరానికి చెందిన విజయ్‌, లోకేశ్‌, శంకర్‌, భాను... మంగళవారం విహార యాత్రకు వచ్చారు. సీలేరు, డొంకరాయి పర్యాటక ప్రాంతాలను సందర్శించి సాయంత్రం మోతుగూడెం బయల్దేరారు. పొల్లూరు ఎగువ జలపాతం మొదటి మలుపు వద్ద వారి కారు అదుపుతప్పి లోయ (జలపాతం)లోకి దూసుకెళ్లింది. ఇది తెలిసి పొల్లూరు యూత్‌ ఘటనా స్థలానికి చేరుకుని కారులో ఉన్న యువకులను బయటకు తీసుకువచ్చారు. మోతుగూడెం పోలీసులకు సమాచారం అందించారు. మోతుగూడెం ఎస్‌ఐ అబ్దుల్‌ నాసిర్‌ హుస్సేన్‌ వెంటనే వచ్చి గాయాలైన యువకులను అంబులెన్స్‌లో మోతుగూడెం జెన్కో ఆస్పత్రికి తరలించారు.

ఈ వార్తలనూ చదవండి..

హై బీమ్‌ ఎల్‌ఈడీ లైట్లతో అగచాట్లు

వేర్వేరు ఘటనల్లో ఐదుగురి బలవన్మరణం

Updated Date - Sep 30 , 2026 | 04:59 AM