Share News

పరారీలో తోపుదుర్తి!

ABN , Publish Date - Oct 27 , 2026 | 03:46 AM

పోలీసులుపై నోరుపారేసుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై కేసు నమోదయింది. పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉందన్న సమాచారంతో ఆయన పరారైనట్లు సమాచారం.

పరారీలో తోపుదుర్తి!

  • పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు

  • వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

  • విషయాన్ని పసిగట్టి భయంతో రాజస్థాన్‌కు పరారీ?

  • పోలీసులపై అనుచిత వ్యాఖ్యలతో కేసు నమోదు

  • అరెస్టుకు రంగంలోకి దిగిన పోలీసు బృందాలు

  • విషయాన్ని పసిగట్టి భయంతో రాజస్థాన్‌కు పరారీ?

  • రౌడీ నాకొడుకుల కాపలాకు ఖాకీలు అవసరమా..!

  • రాండి నా కొడకల్లారా... ఎదురెదురు కొట్టుకుందాం

  • రెచ్చిపోయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

అనంతపురం, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): పోలీసులుపై నోరుపారేసుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై కేసు నమోదయింది. పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉందన్న సమాచారంతో ఆయన పరారైనట్లు సమాచారం. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న తోపుదుర్తి ఆదివారం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ రెచ్చిపోయారు. ‘రౌడీ నా కొడుకులకు(టీడీపీ నేతలు) కాపలా కాసేదానికి ఖాకీ చొక్కాలు అవసరమా..! ఖాకీ చొక్కా వదిలేసి వాళ్లతో కలసి రండి. మేమూ ఖద్దరు వేసుకోవడం మానేస్తాం. మొగోళ్లలా కొట్టుకుందాం. చెప్పులు తీసుకుని తిప్పలాడిచ్చి కొడతాం’ అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ‘స్థానిక ఎన్నికల నామినేషన్ల సమయంలో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఆర్‌వోలు ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా పనిచేశారు.

ఆ సమయంలో జరిగిన దాడులపై ప్రభుత్వం విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలి. లేదు ఇలాగే ఓట్లు వేసుకుంటాం, కౌంటింగ్‌ హాల్‌లో కూడా దౌర్జన్యాలు చేస్తామంటే పోలీసులు ఖాకీ చొక్కాలు విప్పేసి, తెలుగుదేశం గూండాలతో కలిసి రావాలి. రాండి... నా కొడకల్లారా ఎదురెదురు కొట్టుకుందాం. మమ్మల్ని అడ్డుకునేందుకు మీరు బెటాలియన్లు తెచ్చుకుంటున్నారు. సిగ్గులేని నా కొడకల్లారా..! మీకు ప్రభుత్వం నడిపేది వస్తాదా? ఇదేనా ఎన్నికలు నడిపే విధానం? పరిటాల రవి చేసినాడు... పోయినాడు. మళ్లీ అదే చరిత్ర జరగాలనుకుంటే ఈ ఎన్నికలు ఇట్లనే ముందుకు పోనివ్వండి’ అంటూ రెచ్చగొడుతూ మాట్లాడారు. నామినేషన్‌ ప్రక్రియను రాప్తాడు నియోజకవర్గంలో పునఃప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. ‘మేం గట్టిగా మాట్లాడి ఉండొచ్చు. కానీ ధర్మంగానే మాట్లాడుతున్నాం’ అంటూ తన మాట తీరునూ సమర్థించుకున్నారు.


ప్రకాశ్‌రెడ్డి అరెస్టుకు పోలీసు బృందాలు..!

కాగా తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై అనంతపురం త్రీటౌన్‌ పోలీస్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. స్థానిక ఎన్నికల వివాదాలను పోలీసులకు ఆపాదిస్తూ, పోలీసులు, వారి కుటుంబాలను కించపరిచేలా మాట్లాడినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎ్‌సఎ్‌స 351(2)(3), 352, 353, 356 సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు. ఆయను అరెస్టు చేసేందుకు జిల్లా పోలీస్‌ శాఖ పలు బృందాలను నియమించినట్లు తెలుస్తోంది. అరెస్టు చేస్తారన్న విషయాన్ని పసిగట్టిన తోపుదుర్తి రాజస్థాన్‌కు పారిపోయారని సమాచారం.

పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం

మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి తన స్థాయికి మించి మాట్లాడుతున్నరని జిల్లా పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాత్రింబవళ్లు కష్టపడుతున్న పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు సరికాదని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు త్రిలోక్‌నాథ్‌ అన్నారు. తోపుదుర్తి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అర్నబ్’

అతి తీవ్ర తుఫాను..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

Updated Date - Oct 27 , 2026 | 03:46 AM