Share News

మండవ వెంకట్రామయ్య జీవితం భావితరాలకు మార్గదర్శకం

ABN , Publish Date - Oct 12 , 2026 | 04:38 AM

మహోన్నత వ్యక్తిత్వం, నిష్కళంక జీవన విధానానికి నిలువెత్తు రూపమైన మండవ వెంకట్రామయ్య జీవిత గమనం భావితరాలకు మార్గదర్శకమని ..

మండవ వెంకట్రామయ్య జీవితం భావితరాలకు మార్గదర్శకం

  • మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

  • ‘భువి నుంచి భువనం వరకు’ పుస్తకావిష్కరణ

నూజివీడు టౌన్‌, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): మహోన్నత వ్యక్తిత్వం, నిష్కళంక జీవన విధానానికి నిలువెత్తు రూపమైన మండవ వెంకట్రామయ్య జీవిత గమనం భావితరాలకు మార్గదర్శకమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం తుక్కులూరు లో ఆదివారం మండవ వెంకట్రామయ్య ప్రథమ వర్థంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని నివాళులర్పించారు. వెంకట్రామయ్య జీవిత విశేషాలతో రూపొందించిన ‘భువి నుంచి భవనం వరకు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ‘స్వాతంత్య్రం పూర్వం జన్మించి, భారతదేశం ఎదుగుతున్న ప్రతి మలుపునూ ప్రత్యక్షంగా చూసిన ఒక తరం ప్రతినిధి వెంకట్రామయ్య. ఆ రోజుల్లోనే ఉన్నత విద్యా ప్రమాణాలకు నిలయమైన బెనారాస్‌ హిందూ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎస్సీ. పట్టా పొందినప్పటికీ, పట్టణాలకే పరిమితం కాకుండా స్వగ్రామాన్ని వెతుక్కుంటూ వచ్చి నూజివీడు సీడ్స్‌ రూపంలో విత్తన పరిశ్రమను స్థాపించారు.

వ్యాపారంలో ఎదురుదెబ్బలను ఓటములుగా కాక జీవిత పాఠాలుగా స్వీకరించే మనోధైర్యం ఆయన సొంతం. అలాగే ఆయన కోడలు ఆశాప్రియ సైతం స్వర్ణభారత్‌ ట్రస్టుకు అందించిన సహకారం, సంస్కృతి పట్ల వారి నిబద్ధత ఎంతో గొప్పవి’ అన్నారు. కార్యక్రమానికి టీటీడీ అన్నమయ్య ప్రాజెక్టు డైరెక్టర్‌ మేడసాని మోహన్‌ అధ్యక్షత వహించారు. రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ కనుమూరి రఘురామకృష్ణరాజు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, కరణం బలరామకృష్ణమూర్తి, లోక్‌ సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాశ్‌ నారాయణ, సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ మాజీ చైర్మన్‌ కె.వి. చౌదరి, బొల్లినేని కృష్ణయ్య, మండవ వెంకట్రామయ్య కుమారుడు మండవ ప్రభాకర్‌ పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి...

నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్


లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణకు ఘన నివాళి

లోక్‌ నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ జయంతి సందర్భంగా వెంకయ్య నాయుడు ఘన నివాళులు అర్పించారు. గుజరాత్‌ నవ్‌ నిర్మాణ ఉద్యమానికి, బిహార్‌లో సంపూర్ణ విప్లవానికి స్ఫూర్తినిచ్చిన జేపీ.. ఛాత్ర యువ సంఘర్షణ వాహిని వంటి యువజన ఉద్యమాలకు దిశానిర్దేశం చేశారని కొనియాడారు.

ఈ వార్తలనూ చదవండి...

నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్

Updated Date - Oct 12 , 2026 | 04:40 AM