Share News

కూటమిని నాడు విచ్ఛిన్నం చేశా!

ABN , Publish Date - Oct 09 , 2026 | 05:00 AM

ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చేలా నాడు తాను చేసిన ప్రయత్నాలు ఫలించాయని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. కుల, మతాల విషయంలో వైసీపీ అధినేత జగన్‌ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు

కూటమిని నాడు విచ్ఛిన్నం చేశా!

  • ఎన్డీయే నుంచి టీడీపీ బయటికొచ్చేలా నేను చేసిన ప్రయత్నాలు ఫలించాయి

  • కులమతాలపై జగన్‌ది ద్వంద్వ వైఖరి: సాయిరెడ్డి

తిరుపతి సిటీ, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చేలా నాడు తాను చేసిన ప్రయత్నాలు ఫలించాయని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. కుల, మతాల విషయంలో వైసీపీ అధినేత జగన్‌ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. తిరుపతిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. మతాలు, కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే వారికి గుణపాఠం చెప్పాలని విజయసాయిరెడ్డి అన్నారు. జగన్‌ హిందూ మతంలోకి తిరిగొస్తేనే రెడ్డి అనే మాటకు సార్థకత లభిస్తుందని వ్యాఖ్యానించారు. కానీ, ఆయన రెడ్ల సామాజికవర్గానికి తనను రెడ్డిగా, ఇతర మతాలకు తనను మైనారిటీగా పరిచయం చేసుకుంటున్నారని, సున్నితమైన అంశాలను సైతం రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ పాలన బాగుందని కొనియాడారు. వైసీపీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే టీటీడీ బోర్డును రద్దుచేసి, ఆ స్థానంలో పీఠాధిపతులు, మఠాధిపతులకు చోటు కల్పిస్తామన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన కీలక అంశాలివే..

డిజిటల్ కరెన్సీని మోదీ ప్రోత్సహించారు

Updated Date - Oct 09 , 2026 | 05:00 AM