కారుమూరికి ఐదు రోజుల కస్టడీ
ABN , Publish Date - Oct 01 , 2026 | 05:33 AM
మద్యం రవాణా టెండర్లలో అక్రమాల కేసులో వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును కోర్టు అక్టోబరు 5 నుంచి 9వ తేదీ వరకు సిట్ కస్టడీకి అప్పగించింది.
విజయవాడ, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): మద్యం రవాణా టెండర్లలో అక్రమాల కేసులో వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును కోర్టు అక్టోబరు 5 నుంచి 9వ తేదీ వరకు సిట్ కస్టడీకి అప్పగించింది. ఇదే కేసులో ఆయన తనయుడు కారుమూరి సునీల్‌కుమార్ కస్టడీ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. కాగా, వీరిద్దరి బెయిల్ పిటిషన్లపై వాదనలను ఏసీబీ కోర్టు అక్టోబరు 5వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయాధికారి ఎల్.తేజోవతి ఉత్తర్వులు ఇచ్చారు.
సాయికృష్ణ కేసులో నాని బెయిల్‌పై 5న వాదనలు
రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ఏ3గా ఉన్న జంగం నాని బెయిల్ పిటిషన్‌పై వాదనలను విజయవాడలోని ఎనిమిదో అదనపు జిల్లా జడ్జి కోర్టు అక్టోబరు 5వ తేదీకి వాయిదా వేసింది.
ఈ వార్తలనూ చదవండి...
ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’