లోకేశ్‌ని కలిసిన అంధుల క్రికెట్ మాజీ కెప్టెన్ అజయ్‌కుమార్
ABN , Publish Date - Sep 29 , 2026 | 05:12 AM
భారత అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, అర్జున అవార్డు గ్రహీత ఇల్లూరి అజయ్‌కుమార్ రెడ్డి సోమవారం ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేశ్‌ను కలిశారు.
అమరావతి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): భారత అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, అర్జున అవార్డు గ్రహీత ఇల్లూరి అజయ్‌కుమార్ రెడ్డి సోమవారం ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేశ్‌ను కలిశారు. రాష్ట్రంలో అంధుల క్రికెట్ అభివృద్ధితోపాటు గతంలో రాష్ట్రం తరఫున జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అంధ క్రికెటర్ల కోసం ప్రత్యేకంగా క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. అజయ్ విజ్ఞప్తి పట్ల మంత్రి లోకేశ్ సానుకూలంగా స్పందించారు. అజయ్‌తోపాటు ఏపీ అంధుల క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి జి.రవీంద్రబాబు కూడా లోకేశ్‌ను కలిశారు. అజయ్ నేతృత్వంలో భారత అంధుల క్రికెట్ జట్టు మూడుసార్లు ప్రపంచకప్ గెలిచింది.
ఈ వార్తలనూ చదవండి...
పింఛనుదారులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 1న ఉదయం 6:30 నుంచే పింఛన్ల పంపిణీ
పీఎం కిసాన్ 24వ విడత.. రైతులు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే..