Share News

ఎక్స్‌ప్రెస్ రైలు చక్రాల్లో మంటలు.. రైలులో కలకలం

ABN , Publish Date - Mar 18 , 2026 | 09:28 PM

గుంటూరు నుంచి తిరుపతి వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు చక్రాల్లో మంటలు చెలరేగాయి. ఎస్7 బోగీ బ్రేకులు పట్టివేయడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఎక్స్‌ప్రెస్ రైలు చక్రాల్లో మంటలు.. రైలులో కలకలం
Guntur Tirupati train fire

అమరావతి, మార్చి 18: గుంటూరు నుంచి తిరుపతి వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు చక్రాల్లో మంటలు చెలరేగాయి. ఎస్7 బోగీ బ్రేకులు పట్టివేయడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించి ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ట్రైన్ చైన్ లాగారు. రైలు ఆగిపోయింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఎస్7 బోగీ దగ్గరకు చేరుకున్నారు. బ్రేకులు రిపేర్ అయిన తర్వాతే రైలు అక్కడినుంచి కదిలింది. ఇక, ఈ సంఘటన బుధవారం తర్లుపాడు రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది.


మరో ఘటనలో..

నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్‌లోని టికెట్ బుకింగ్ కార్యాలయంలో సోమవారం ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. టికెట్ బుకింగ్ కౌంటర్ల సమీపంలో ఉన్న విద్యుత్ కేబుళ్ల జంక్షన్ బాక్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మంటలు వ్యాపించడాన్ని గమనించిన బుకింగ్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు.


ఇవి కూడా చదవండి

రాత్రి భోజనం మానేయడం ఆరోగ్యానికి మంచిదేనా?

బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం.. అందరూ చూస్తుండగానే కాలి బూడిదైన 9 మంది..

Updated Date - Mar 18 , 2026 | 09:56 PM