శ్రీసిటీలో అగ్ని ప్రమాదం
ABN , Publish Date - Oct 09 , 2026 | 05:32 AM
శ్రీసిటీలోని వెంచర్ ఆటోమోటివ్ పరిశ్రమలో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోమోటివ్ విభాగాలను తయారుచేసే వెంచర్ పరిశ్రమలో ఉదయం 7 గంటలకు మిషనరీ విభాగంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా హఠాత్తుగా మంటలు చెలరేగాయి.
రూ.80 లక్షల ఆస్తి నష్టం
సత్యవేడు(శ్రీసిటీ), అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): శ్రీసిటీలోని వెంచర్ ఆటోమోటివ్ పరిశ్రమలో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోమోటివ్ విభాగాలను తయారుచేసే వెంచర్ పరిశ్రమలో ఉదయం 7 గంటలకు మిషనరీ విభాగంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా హఠాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన పరిశ్రమ ప్రతినిధులు శ్రీసిటీ అగ్నిపమాక కేంద్రానికి సమాచారం అందించారు. శ్రీసిటీ ఇన్‌చార్జి అగ్నిమాపక శాఖ అధికారి రాజయ్య సిబ్బందితో కలసి పరిశ్రమ వద్దకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే పరిశ్రమలో కొన్ని యంత్రాలు కాలిపోయి రూ.80 లక్షల మేరకు ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. కాగా, శ్రీసిటీలోని టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో ఇటీవల బాయిలర్ పేలి ఐదుగురు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటన జరిగి వారం కూడా గడవకముందే మరో పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం.
ఈ వార్తలనూ చదవండి:
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన కీలక అంశాలివే..
డిజిటల్ కరెన్సీని మోదీ ప్రోత్సహించారు