Share News

శ్రీకాళహస్తీశ్వరాలయ పోటులో అగ్నిప్రమాదం

ABN , Publish Date - Nov 13 , 2026 | 04:29 AM

ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయ పోటులో గురువారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆలయంలోని దక్షిణ గోపురానికి ఆనుకుని పోటు ఉంది.

శ్రీకాళహస్తీశ్వరాలయ పోటులో అగ్నిప్రమాదం

శ్రీకాళహస్తి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయ పోటులో గురువారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆలయంలోని దక్షిణ గోపురానికి ఆనుకుని పోటు ఉంది. ఇక్కడ ప్రసాదాలు తయారుచేసి ప్యాకింగ్‌ కేంద్రానికి తరలిస్తుంటారు. పోటులో గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో వడలు తయారు చేస్తుండగా బాండలి నుంచి మంటలు ఎగసిపడ్డాయి. పోటులో చమురు జిడ్డు ఉండటంతో ఒకసారిగా మంటలు వ్యాపించాయి.

దీంతో సిబ్బంది హుటాహుటిన అధికారులను అప్రమత్తం చేశారు. ఆలయ చైర్మన్‌ కొట్టే సాయి, ఈవో బీకే వెంకటేశ్వర్లు పోటు వద్దకు చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో సుమారు రూ.లక్ష ఆస్తి నష్టం వాటిల్లినట్టు అధికారులు ధ్రువీకరించారు.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం

ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు

Updated Date - Nov 13 , 2026 | 04:32 AM