ఛీ..ఛీ.. ఇదేం నీచం!
ABN , Publish Date - Nov 11 , 2026 | 03:56 AM
‘ఆంధ్రజ్యోతి’ అక్షరం...ప్రజల చేతిలో ఆయుధం!. వాస్తవాలను నిక్కచ్చిగా వెలుగులోకి తీసుకొచ్చే పత్రిక అన్న పేరు ప్రజల్లో నాటుకుపోయింది. ఈ నమ్మకాన్ని అడ్డం పెట్టుకొని...
‘ఆంధ్రజ్యోతి’ పేరుతో దుష్ప్రచారాలు
ప్రతిసారీ వైసీపీ పేటీఎమ్‌ల బరితెగింపు
పవన్ అంశంలోనూ అదే శాడిస్టు పోకడ
పవన్ దంపతుల ప్రకటనను మాత్రమే ప్రచురించిన ‘ఆంధ్రజ్యోతి’
ఆ వార్త జగన్ మీడియాలోనూ ప్రసారం
కానీ, ‘ఆంధ్రజ్యోతి’ స్టింగ్ ఆపరేషన్ అని తప్పుడు ప్రచారం
ఓ ఫేక్ క్లిప్పింగ్ సృష్టించి ‘ఎక్స్’లో పోస్టు
విదేశాల్లో ఉండే వైసీపీ నేత చింతా ప్రదీప్‌రెడ్డి అవాకులు
అబద్ధాలను నమ్మించేందుకు అడ్డదారులు
ఆ వార్త ఫేక్ అని తేల్చేసిన ‘ఎక్స్ గ్రోక్’
‘ఆంధ్రజ్యోతి’ అక్షరం...ప్రజల చేతిలో ఆయుధం!. వాస్తవాలను నిక్కచ్చిగా వెలుగులోకి తీసుకొచ్చే పత్రిక అన్న పేరు ప్రజల్లో నాటుకుపోయింది. ఈ నమ్మకాన్ని అడ్డం పెట్టుకొని ,తప్పుడు ప్రచారాలతో ప్రజల్లో గందరగోళం సృష్టించాలని, వ్యక్తులపై బురద జల్లాలని వైసీపీ పేటీఎమ్‌లు కుట్రలు చేస్తున్నారు. తాజాగా పవన్‌కల్యాణ్ వ్యక్తిగత విషయంలోనూ ‘ఆంధ్రజ్యోతి’ పేరుతో తప్పుడు ప్రచారాలకు బరి తెగించారు. నిజానికి ‘ఆంధ్రజ్యోతి’, ‘ఏబీఎన్’లో పవన్ దంపతులు తమ విడాకుల నిర్ణయంపై ఇచ్చిన అధికారిక ప్రకటన మినహా మరే వార్తనూ ఇవ్వలేదు. ఇది విస్పష్టం. కానీ, అందరి కంటే ముందుగా ‘ఆంధ్రజ్యోతి’ స్టింగ్ ఆపరేషన్ చేసి, ఈ విషయం బయటపెట్టిందంటూ తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. ‘అది తప్పుడు వార్త’ అని ‘ఎక్స్ గ్రోక్’ తేల్చినా, వారి బుద్ధి మారడం లేదు. సున్నితమైన అంశాలను ‘ఆంధ్రజ్యోతి’కి అంటగట్టి, వివాదాలు సృష్టించే శాడిస్ట్ పోకడనే ఈ సైకోలు మరోసారి ప్రదర్శించారు.
ఆ న్యూస్ (ఫేక్ క్లిప్పింగ్) తొలిగా అంకుల్ సామ్ 786 ఖాతా నుంచి పోస్టయింది. కానీ, అందులోని క్లిప్ నిజమైనది కాదు. అది ఫేక్. ఈ ఖాతాలో పోస్టుచేసిన న్యూస్‌కు స్పష్టమైన ఆన్‌లైన్ ప్రింటెడ్ వర్షన్ లేదు. గాసి్‌పను సృష్టించేలా తయారు చేసిన పేజీలా అది కనిపిస్తోంది. ఆ న్యూస్‌లో ఉన్న కంటెంట్‌కు వాస్తవికత, విశ్వసనీయత లేవు.
- ‘ఎక్స్ గ్రోక్’
(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్- అన్నా దంపతులు తాము విడిపోతున్నామని అధికారికంగా విడుదల చేసిన ప్రకటనను రాష్ట్ర, జాతీయస్థాయి మీడియా సంస్థలు ప్రచురించాయి. జగన్ టీవీ, దాని అనుబంధ నీలి, కూలి మీడియాలు బ్రేకింగ్ న్యూస్‌లు ఇచ్చాయి. ఇదే వార్తను ‘ఆంధ్రజ్యోతి’ కూడా ప్రచురించింది. వ్యక్తిగత అంశాల్లోని సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, వారిద్దరు చేసిన ప్రకటనను మాత్రమే తన పాఠకులకు అందించింది. కానీ, ఈ అంశాన్ని ‘ఆంధ్రజ్యోతి’కి అంటగట్టేందుకు వైసీపీ పేటీఎంలు తెగబడ్డారు.
ప్రజలను గందరగోళానికి గురి చేసేందుకు విఫలయత్నం చేశారు. ‘అంకుల్‌సామ్ 786’ ఖాతా నుంచి ఓ సైకో ‘ఆంధ్రజ్యోతి’ పేరిట ఫేక్ న్యూస్ పేపర్‌ను సృష్టించాడు. పవన్ మరో పెళ్లికి సిద్ధమవుతున్నారని.. స్టింగ్ ఆపరేషన్ చేసి ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించిందంటూ ఓ ఫేక్ న్యూస్‌పేపర్‌ను ‘ఎక్స్’లో పోస్టు చేశాడు. ‘పవన్ నాలుగో పెళ్లాం..’ అంటూ, శీర్షిక లాగే.. ఆ వార్త మొత్తం అసభ్యకరమైన భాషలోనే నడిచింది. ‘ఎక్స్’తోపాటు ‘ఫేస్‌బుక్’లోనూ అదే అంశాన్ని మరో ఖాతా నుంచి అతడు పోస్టు చేశాడు. నిజానికి, వైసీపీ అధినేతకు పత్రిక, టీవీ ఉన్నాయి. అయితే, వాటిలో ఏ వార్త వచ్చినా ముందు ఆ పార్టీ నేతలే నమ్మరు. విశ్వసించరు. జనం చీ కొడతారు. అందువల్లే ప్రజలు బాగా ఆదరించే ‘ఆంధ్రజ్యోతి’ పేరిట ఫేక్ కథనాలు వండివార్చేందుకు వైసీపీ పేటీఎమ్‌లు అహోరాత్రులు కష్టపడుతున్నారు.
అలా జగన్ ప్రకటన.. ఇలా ఫేక్ ప్రచారం..
వ్యక్తుల వ్యక్తిగత జీవితాల గురించి వైసీపీ నేతలు, కార్యకర్తలు, సోషల్‌మీడియా ప్రతినిధులు అనవసరంగా రాయవద్దని, కామెంట్స్ వద్దని ఆ పార్టీ అధినేత జగన్ సోమవారం రాత్రి ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన తర్వాత, తొలిసారి మంగళవారం ఉదయం 8.47 గంటలకు వైసీపీ సైకో పోస్టు కనిపించడం గమనార్హం. నిజానికి జగన్ ప్రకటన తర్వాత వైసీపీ కార్యకర్తలు, నేతలు కొందరు మౌనంగానే ఉన్నారు. కానీ సోషల్‌మీడియాలో ఫేక్ పేర్లతో ఖాతాలు నడిపే ఆ పార్టీ నేతలు మాత్రం బరి తెగించారు.
విడాకుల విషయం తొలిసారి బయటపెట్టింది ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ అంటూ విదేశాల్లో ఉండే వైసీపీ నేత చింతా ప్రదీప్‌రెడ్డి అడ్డగోలు వ్యాఖ్యలతో పోస్టులు పెట్టారు. పవన్ వ్యక్తిగత జీవితం గురించి తాము ఎన్నడూ మాట్లాడలేదు అన్నట్టు సుద్దపూస కబుర్లు చెప్పుకొచ్చారు. అధినేత చెప్పినా సైకో పేటీఎమ్‌లు పాటించడం లేదంటే అది కూడా ఓ వ్యూహంలో భాగమేనా? లేక జగన్ చెబితే వినే పరిస్థితి పేటీఎమ్ సైకోలకు లేదనేలా అనే సందేహాలు కలుగుతున్నాయి.
అది ఫక్తు ఫేక్ న్యూస్...
పవన్ నాలుగో పెళ్లి, ‘ఆంధ్రజ్యోతి’ స్టింగ్ ఆపరేషన్ అంటూ అంకుల్‌సామ్ 786 ఖాతాతో ఎక్స్‌లో పోస్టుచేసింది ఫక్కా ఫేక్ న్యూస్, విశ్వసనీయత లేని కంటెంట్ అని ఆ సంస్థే నిర్ధారించింది. ‘‘ఈ ఖాతాలో చూపించిన న్యూస్ తొలిగా అంకుల్‌సామ్ ఖాతానుంచి పోస్టయింది. కానీ, అందులో చూపించిన క్లిప్ నిజమైనది కాదు. అది ఫేక్. ఈ ఖాతాలో పోస్టుచేసిన న్యూస్‌కు స్పష్టమైన ఆన్‌లైన్ ప్రింటెడ్ వర్షన్ లేనేలేదు. ఇది గాసి్‌పను సృష్టించేలా తయారు చేసిన పేజీలా కనిపిస్తోంది. అది నిర్ధారించింది. ఆ న్యూస్‌లో ఉన్న కంటెంట్‌కు వాస్తవికత, విశ్వసనీయత లేవు.’’ అని ఎక్స్ ఇంటెలిజెంట్ ‘ఏఐ గ్రోక్’ తేల్చేసింది.
ఎందుకిలా?
వైసీపీ సోషల్‌మీడియా సైకోలు ప్రతీసారి ‘ఆంధ్రజ్యోతి’నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? తాము టార్గెట్ చేసుకున్నవారి ప్రతిష్ఠను రాజకీయంగా, వ్యక్తిగతంగా దెబ్బతీసేందుకు ఆ పత్రిక ప్రచురించిన వార్త ఇదే... అంటూ ప్రతిసారీ ఎందుకు ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారు? ఇందుకు ఒక్కటే కారణం.. ప్రజల్లో ‘ఆంధ్రజ్యోతి’కి ఉన్న ఆదరణ. అందులో ఒక వార్త వచ్చిందంటే అది నిజమై ఉంటేనే ప్రచురిస్తారని ప్రజల నమ్మకం. అందుకే వైసీపీ సోషల్ సైకోలు ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించని, కనీసం కన్నెత్తి చూడని అంశాల్లో కూడా వార్తలు ప్రచురించినట్లుగా, ప్రత్యేక ఆపరేషన్‌లు నిర్వహించి వార్తలు రాసినట్లుగా ఫేక్‌న్యూస్ వండివార్చి సోషల్‌మీడియాలో పోస్టుచేస్తున్నారు. ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడానికి కుట్రలు చేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు
30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!