Share News

హెచ్‌పీసీఎల్‌లో పేలుడు

ABN , Publish Date - Nov 03 , 2026 | 06:48 AM

విశాఖలోని హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌)లో సోమవారం రాత్రి ఆయిల్‌ ట్యాంకర్‌ వద్ద పేలుడు సంభవించింది

హెచ్‌పీసీఎల్‌లో పేలుడు

  • సల్ఫర్‌ ప్లాంటులో ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తుండగా ప్రమాదం

  • ఉవ్వెత్తున ఎగసిపడిన మంటలు

మల్కాపురం(విశాఖపట్నం), నవంబరు 2(ఆంధ్రజ్యోతి): విశాఖలోని హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌)లో సోమవారం రాత్రి ఆయిల్‌ ట్యాంకర్‌ వద్ద పేలుడు సంభవించింది. ‘సల్ఫర్‌ ప్లాంటులో ట్రయల్‌ నిర్వహిస్తుండగా ట్యాంకు పేలిపోయింది. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. భయపడాల్సిన పనిలేదు’ అని కంపెనీ ప్రకటించింది. హెచ్‌పీసీఎల్‌ కూలింగ్‌ టవర్‌ సమీపంలో సోమవారం రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో ఆయిల్‌ ట్యాంకు వద్ద పేలుడు సంభవించింది. కమిషనింగ్‌ ప్రక్రియ పూర్తికాని నూతన సల్ఫర్‌ ప్లాంటులో ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు ఆందోళనకర వాతావరణం నెలకొంది. పోలీసు, అగ్నిమాపక శాఖతో పాటు పరిశ్రమల యజమాన్యాలు, హెచ్‌పీసీఎల్‌ అధికారులు సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పేలుడు ఘటనతో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ప్రమాదం వివరాలను అధికారుల నుంచి సేకరించామని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు తెలిపారు. అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపుచేశారని చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి:

త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి

Updated Date - Nov 03 , 2026 | 06:48 AM