Share News

అత్యంత పారదర్శకంగా ఎక్సైజ్‌ పాలసీ అమలు

ABN , Publish Date - Sep 27 , 2026 | 04:54 AM

రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్సైజ్‌ పాలసీని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నామని కొల్లు రవీంద్ర అన్నారు. మద్యం సీసా డిస్టిలరీ నుంచి దుకాణానికి చేరేవరకు ట్రేస్‌ అండ్‌ ట్రాక్‌ విధానంతో అవినీతి లేకుండా..

అత్యంత పారదర్శకంగా ఎక్సైజ్‌ పాలసీ అమలు

  • వైసీపీ ప్రభుత్వంలో జేబులు నింపుకోవడమే పని: కొల్లు

విశాఖపట్నం, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్సైజ్‌ పాలసీని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నామని కొల్లు రవీంద్ర అన్నారు. మద్యం సీసా డిస్టిలరీ నుంచి దుకాణానికి చేరేవరకు ట్రేస్‌ అండ్‌ ట్రాక్‌ విధానంతో అవినీతి లేకుండా కట్టడి చేశామని పేర్కొన్నారు. శనివారం విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఎక్సైజ్‌ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఎక్సైజ్‌ పాలసీని తన దోపిడీకి అనుకూలంగా మార్చుకుందని విమర్శించారు. జేబులు నింపుకోవడమే అజెండాగా ప్రభుత్వ మద్యం దుకాణాల పేరుతో అడ్డగోలుగా అవినీతికి పాల్పడిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక అత్యుత్తమ మద్యం పాలసీని అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు

పర్యాటకం జోరు

Updated Date - Sep 27 , 2026 | 04:54 AM