ఎటపాక జడ్పీటీసీ ఎన్నికలో కూటమి గుర్తు లేకుండానే బ్యాలెట్
ABN , Publish Date - Oct 28 , 2026 | 05:28 AM
పోలవరం జిల్లా ఎటపాక జడ్పీటీసీ స్థానానికి కూటమి అభ్యర్థి లేరు. ఇక్కడ కూటమి పార్టీల గుర్తే లేకుండా బ్యాలెట్ పత్రం తయారవుతోం ది. ఆది నుంచీ ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పాయం దేవిని స్థానిక క్యాడర్ బలపరిచి ప్రచారం చేసింది.
రంపచోడవరం/ఎటపాక, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): పోలవరం జిల్లా ఎటపాక జడ్పీటీసీ స్థానానికి కూటమి అభ్యర్థి లేరు. ఇక్కడ కూటమి పార్టీల గుర్తే లేకుండా బ్యాలెట్ పత్రం తయారవుతోం ది. ఆది నుంచీ ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పాయం దేవిని స్థానిక క్యాడర్ బలపరిచి ప్రచారం చేసింది. ఆమేరకు ఆమె నామినేషన్ వేసి, బీఫారం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే కూటమి సర్దుబాట్లలో భాగంగా జనసేనకు ఈ స్థానం కేటాయించారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన మాజీ జడ్పీటీసీ ఉబ్బా సుస్మితను జనసేనలో చేర్చుకొని సోమవారం రాత్రి ఆమెకు బీఫారం ఇచ్చారు. మంగళవారం ఆమె బీఫారాన్ని రిటర్నింగ్ అధికారికి అందజేశారు.
దీంతో పాయం దేవిని, ఆమెకు డమ్మీగా నామినేషన్ వేసిన మరో మహిళను నామినేషన్లు ఉపసంహరించుకోవాలని టీడీపీ అధిష్ఠానం ఆదేశించింది. పాయం దేవి మాత్రం ఉపసంహరణకు ససేమిరా అన్నారు. దీంతో ఆమెను స్వతంత్య్ర అభ్యర్థిగా గుర్తించి బీరువా గుర్తును కేటాయించారు. బీఫారం ఇచ్చినా సాంకేతిక కారణంతో జనసేన అభ్యర్థిని స్వతంత్ర అభ్యర్థిగానే గుర్తించిన రిటర్నింగ్ అధికారి ఏసీ గుర్తును కేటాయించారు. వైసీపీ అభ్యర్థి కామేశ్వరికి మాత్రం ఆ పార్టీ అధికారిక గుర్తు పంకా కేటాయించారు.
ఈ వార్తలనూ చదవండి:
తీరం దాటుతున్న ఆర్నబ్ తుఫాన్..!
ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు