Share News

ఇంజినీర్ నూకరాజు ఫ్యామిలీ ఆత్మహత్య కేసు.. పోలీసులకు చిక్కిన సాధిక్‌ ఖాన్‌!

ABN , Publish Date - Aug 21 , 2026 | 09:40 PM

ఇంజినీర్ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు కోచ్ సాధిక్ ఖాన్ పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. కాకినాడ నుంచి వెళ్లిన పోలీసు బృందాలు ఢిల్లీలో అతడిని పట్టుకున్నట్లు సమాచారం.

ఇంజినీర్ నూకరాజు ఫ్యామిలీ ఆత్మహత్య కేసు.. పోలీసులకు చిక్కిన సాధిక్‌ ఖాన్‌!
Nookaraju Family Case

ఇంటర్‌నెట్ డెస్క్: ఇంజినీర్ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు కోచ్ సాధిక్ ఖాన్ పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. కాకినాడ నుంచి వెళ్లిన పోలీసు బృందాలు ఢిల్లీలో అతడిని పట్టుకున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. పోలీసులు రేపు రాత్రికి సాధిక్‌ను కాకినాడకు తీసుకురానున్నారు. ఆ తర్వాత ఇంజినీర్ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడంలో సాధిక్ ఖాన్ పాత్ర.. ఆ కుటుంబాన్ని ఎందుకు వేధించాడు అనే విషయాల గురించి ఎంక్వైరీ చేయనున్నారు.


కోచ్ సాధిక్ ఖాన్ వేధింపుల కారణంగానే తమ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఈ నెల 16వ తేదీన సూసైడ్ నోట్ రాసి నూకరాజు కుటుంబం రాజమండ్రిలో గోదావరిలోకి దూకింది. ఇప్పటి వరకు నూకరాజు, ఆయన కూతురు సౌజన్య మృతదేహాలు గోదావరిలో లభ్యమయ్యాయి. నూకరాజు భార్య మీనా కోసం పోలీసులు గాలిస్తున్నారు. నూకరాజు ఫ్యామిలీ ఆత్మహత్యకు కారకుడైన సాధిక్ ఖాన్‌పై కాకినాడ, రాజమండ్రి పోలీస్ స్టేషన్‌‌లలో కేసులు నమోదయ్యాయి. సాధిక్ నోరు విప్పితేనే నూకరాజు కుటుంబం ఆత్మహత్య వెనుక ఉన్న మిస్టరీ వీడనుంది.


ఇవి కూడా చదవండి

16 ఏళ్లుగా మారని పాకిస్థాన్ రాత.. ఇంగ్లండ్‌ గడ్డపై కొనసాగుతోన్న చెత్త రికార్డు!

కాకినాడ ఎక్స్‌ప్రెస్‌ రైలులో 13 నెలల చిన్నారి మృతి

Updated Date - Aug 21 , 2026 | 09:47 PM