Share News

మన్యంలో ‘గజ..గజ’

ABN , Publish Date - Oct 14 , 2026 | 06:20 AM

పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ సమీపంలోని సువర్ణముఖి నది పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తోంది.

మన్యంలో ‘గజ..గజ’

మక్కువ, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ సమీపంలోని సువర్ణముఖి నది పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. మార్కొండపుట్టి, మర్రివానివలస గ్రామాల్లో సోమవారం సంచరించిన ఏనుగులు.. మంగళవారం ఉదయానికి సువర్ణముఖి నది వంతెన వద్దకు చేరుకున్నాయి. ఏనుగులు ఒక దశలో మక్కువ గ్రామంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నం చేస్తుండగా.. స్థానికులు శబ్ధాలు చేసి వెళ్లగొట్టారు. సాయంత్రం 6 గంటల సమయానికి ఏనుగులు తోటలు, పొలాల్లో తిష్ఠ వేశాయి.

ఈ వార్తలనూ చదవండి:

కొత్త డీఎస్సీలో 290 పోస్టులు

గిన్నిస్‌ బుక్‌లోకి 75 గంటల డప్పుమోత

Updated Date - Oct 14 , 2026 | 06:20 AM