Share News

కాకినాడలో దారుణం.. కోతుల దాడిలో వృద్ధురాలు మృతి..

ABN , Publish Date - Mar 21 , 2026 | 08:18 PM

గేదెకు నీళ్లు పెట్టేందుకు వెళ్లిన వృద్ధురాలిపై కోతుల మూక దాడి చేసింది. కోతుల మూక దాడిలో గాయపడ్డ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన కాకినాడలో శనివారం చోటుచేసుకుంది.

కాకినాడలో దారుణం.. కోతుల దాడిలో వృద్ధురాలు మృతి..
Kakinada monkey attack

ఇంటర్‌నెట్ డెస్క్: కాకినాడలో దారుణం చోటుచేసుకుంది. గేదెకు నీళ్లు పెట్టేందుకు వెళ్లిన వృద్ధురాలిపై కోతుల మూక దాడి చేసింది. కోతుల మూక దాడిలో గాయపడ్డ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రత్తిపాడు మండలం పెద్దపాలెం గ్రామానికి చెందిన 68 ఏళ్ల దానబోయిన చిన్నబుల్లి అనే మహిళకు గ్రామ శివారులో 3 ఎకరాల జీడిమామిడి తోట ఉంది. ఆమె ఆ తోటలో ఇళ్లు కట్టుకుని కుమార్తె కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. చిన్నబుల్లి శనివారం గేదెకు నీళ్లు పెట్టేందుకు వెళ్లారు.


అక్కడ ఉన్న దాదాపు 20 కోతులు ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాయి. విచక్షణా రహితంగా కొరికాయి. కోతి మూక నుంచి తప్పించుకునే అవకాశం లేకపోవటంతో చిన్నబుల్లి తీవ్రంగా గాయపడ్డారు. ఆ గాయాల కారణంగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గురించి గ్రామస్థులు మాట్లాడుతూ.. ఆ ప్రాంతంలో కోతుల బెడద చాలా ఎక్కువగా ఉందని అన్నారు. గతంలో కూడా చాలా సార్లు కోతులు గ్రామస్థులపై దాడి చేశాయని తెలిపారు. కానీ, కోతుల దాడిలో ఓ మనిషి ప్రాణాలు కోల్పోవటం ఇదే మొదటిసారి అని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి

అతడి స్థాయిని ఎవరూ భర్తీ చేయలేరు: కె. శ్రీకాంత్

100 సీట్లలో కాంగ్రెస్ పోటీ.. హిమంత ప్రభుత్వానికి ఉద్వాసన తప్పుదు: గౌరవ్ గొగోయ్

Updated Date - Mar 21 , 2026 | 08:27 PM