Share News

ఎల్‌నినో ప్రభావంపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

ABN , Publish Date - Aug 17 , 2026 | 06:16 PM

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉందని, వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సాధారణ వర్షపాతం కంటే తీవ్రమైన లోటు కనిపిస్తోందని చెప్పారు.

ఎల్‌నినో ప్రభావంపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
El Nino Andhra Pradesh

ఇంటర్‌నెట్ డెస్క్: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉందని, వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సాధారణ వర్షపాతం కంటే తీవ్రమైన లోటు కనిపిస్తోందని చెప్పారు. సోమవారం అసెంబ్లీలో ఎల్‌నినోపై చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అసెంబ్లీ వేదికగా ఎల్‌నినో విషయమై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కావేరి జలాల విషయంలో తమిళనాడు-కర్ణాటక మధ్య జరుగుతున్న వివాదంలో సుప్రీం కూడా జోక్యం చేసుకుందని తెలిపారు.


ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘గ్రామాల మధ్య, రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య కూడా నీటి సమస్యలు వస్తున్నాయి. 2026 జూన్-డిసెంబర్ వరకు 867 మిల్లీ మీటర్ల వర్షపాతం పడాల్సి ఉంటే.. కేవలం 557 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదవుతుందని ఓ అంచనా. ఈ ఏడాది అన్ని జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కానుంది. కొన్ని జిల్లాల్లో జులై నెలలో 68 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఆగస్టు నెలలో 35 శాతం, సెప్టెంబర్ నెలలో 35 శాతం, అక్టోబర్‌లో 25 శాతం, నవంబర్‌‌లో 20 శాతం మేర లోటు వర్షపాతం నమోదు కానుంది’..


‘డిసెంబర్ నెలలో మాత్రం 1 శాతం అదనపు వర్షపాతం నమోదువుతుంది. వివిధ బేసిన్లల్లో జలాలు తగ్గిపోతున్నాయి. ప్రాజెక్టులు, రిజర్వాయర్లల్లో జలాలు అడుగంటుతున్నాయి. శ్రీశైలానికి 753 టీఎంసీల నీరు రావాల్సి ఉంటే.. ఈసారి 214 టీఎంసీల నీరు మాత్రమే వచ్చింది. మన రాష్ట్రానికి నీళ్లు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వస్తాయి. వాళ్ల రిజర్వాయర్లు నిండిన తర్వాతే మనకు నీళ్లు వస్తాయి. దీని వల్ల శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు నీరు తక్కువగా వస్తోంది. గోదావరి బేసిన్లో కూడా జలాల లభ్యత తక్కువగా ఉంది’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

బంధువుల ఇంటికి వెళ్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి..

టెస్టుల్లో అరుదైన ఘనత.. కపిల్ దేవ్ సరసన రవీంద్ర జడేజా

Updated Date - Aug 17 , 2026 | 06:35 PM