Share News

‘స్థానికం’లో ‘ఏకం’

ABN , Publish Date - Oct 03 , 2026 | 05:06 AM

రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీలకు సంబంధం లేకుండా ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలపై అవగాహన, వాటిని పరిష్కరించే సత్తా ఉన్న 1.60 లక్షల మంది స్వచ్ఛందంగా పోటీ చేస్తారని..

‘స్థానికం’లో ‘ఏకం’

  • ఎన్నికల్లో 1.60 లక్షల మంది స్వచ్ఛందంగా పోటీ: కేకే సర్వే సంస్థ అధినేత కిరణ్‌

  • పార్టీలతో సంబంధం లేకుండా బరిలోకి.. ఇందుకోసం ఏకం పేరుతో వేదిక

విజయవాడ, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీలకు సంబంధం లేకుండా ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలపై అవగాహన, వాటిని పరిష్కరించే సత్తా ఉన్న 1.60 లక్షల మంది స్వచ్ఛందంగా పోటీ చేస్తారని కేకే సర్వే సంస్థ అధినేత కొండేటి కిరణ్‌ వెల్లడించారు. వారిని ఏకం చేసి ఒకే మాట, ఒకే నినాదంతో ఎన్నికలలో దిగేలా చేస్తామన్నారు. ఇందుకోసం ‘ఏకం’ పేరుతో ఒక వేదికను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు సభ్యులుగా చేరాలని పిలుపునిచ్చారు. వారి తరఫున తాను ప్రచారం చేస్తానని వెల్లడించారు. శుక్రవారం విజయవాడలోని ఓ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 2014-19 నుంచి ఎలాంటి సమస్యలు ఉన్నాయో, 2019-2024 వరకు అవే ఉన్నాయని, 2024 నుంచి ఇప్పటి వరకు ఆ సమస్యలు అలాగే ఉన్నాయన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదన్న అసంతృప్తి 70 శాతం ప్రజల్లో ఉందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలపైనా సర్వే చేశామన్నారు. పార్టీలు ఎంపిక చేసే అభ్యర్థులకు సమస్యల కన్నా, పదవులే ముఖ్యంగా ఉంటున్నాయని చెప్పారు. రాష్ట్రంలో తాగునీటి సమస్యపై 58 శాతం, సాగునీటిపై 55 శాతం, రోడ్లపై గుంతలు అంశంపై 53, పారిశుధ్యంపై 42 శాతం వ్యతిరేకత వ్యక్తం చేశారని వివరించారు.

ఈ వార్తలనూ చదవండి..

స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలిమెట్టు

శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు

Updated Date - Oct 03 , 2026 | 05:07 AM