Share News

ఎంపీ అవినాష్ రెడ్డి నివాసంలో భారీగా నగదు సీజ్: ఈడీ

ABN , Publish Date - Aug 21 , 2026 | 06:24 PM

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసంలో లెక్క చూపని రూ.24 లక్షలు సీజ్‌ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రకటించింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం అధికారిక ప్రకటన చేసింది.

ఎంపీ అవినాష్ రెడ్డి నివాసంలో భారీగా నగదు సీజ్: ఈడీ

హైదరాబాద్, ఆగస్టు21: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసంలో లెక్క చూపని రూ.24 లక్షలు సీజ్‌ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రకటించింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం అధికారిక ప్రకటన చేసింది. ఎంపీ నివాసంలో రెండు బ్యాంక్‌ లాకర్ల తాళాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. నెల రోజుల ముందే వివేకా హత్యకు కుట్ర జరిగిందని దస్తగిరి వెల్లడించారని గుర్తు చేసింది. హత్య కోసం దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి రూ.40 కోట్లు ఆఫర్‌ చేశారని పేర్కొంది.


రూ.40 కోట్లలో వాటాగా రూ.5 కోట్లు.. దస్తగిరికి ఇస్తానని ఎర్ర గంగిరెడ్డి ప్రలోభపెట్టారని ఈడీ చెప్పింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్, చార్జ్‌షీట్లు ఆధారంగా ECIR నమోదు చేసినట్లు తెలిపింది. IPC (121B), 302 సెక్షన్‌ PMLA కింద కేసు నమోదు చేశామని ఈడీ వివరించింది. ఈ సోదాల్లో నేరానికి సంబంధించిన.. కీలక డాక్యుమెంట్లు, డిజిటల్‌ పరికరాలు సీజ్‌ చేశామని ఈడీ స్పష్టం చేసింది. హైదరాబాద్‌, కడప నగరాల్లోని మొత్తం ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు ఈడీ వివరించింది.


WhatsApp Image 2026-08-21 at 5.54.07 PM.jpeg

WhatsApp Image 2.jpeg

Updated Date - Aug 21 , 2026 | 06:44 PM