Share News

బ్యాంకుకు బియ్యం వ్యాపారి బురిడీ

ABN , Publish Date - Nov 11 , 2026 | 05:01 AM

బ్యాంకులో తప్పుడు పత్రాలు తాకట్టు పెట్టి రూ.కోట్ల రుణం తీసుకున్నా డు. వాటితో బినామీల పేరిట స్థిరాస్తులు కొనుగోలు చేశాడు.

బ్యాంకుకు బియ్యం వ్యాపారి బురిడీ

  • తప్పుడు పత్రాలతో రుణం..

  • 18.33 కోట్ల స్థిరాస్తులు జప్తు చేసిన ఈడీ

విశాఖపట్నం, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): బ్యాంకులో తప్పుడు పత్రాలు తాకట్టు పెట్టి రూ.కోట్ల రుణం తీసుకున్నా డు. వాటితో బినామీల పేరిట స్థిరాస్తులు కొనుగోలు చేశాడు. మోసాన్ని గుర్తించిన బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో రైసు మిల్లు యజమానిపై విశాఖపట్నం ఈడీ అధికారులు దాడులు జరిపి రూ.18.33 కోట్ల స్థిరాస్తులు జప్తు చేశారు. కల్లం మోడరన్‌ రైస్‌ మిల్స్‌ యజమాని కల్లం పేరిరెడ్డి 2010-2013 మధ్య గుంటూరులో అప్పటి ఎస్‌బీహెచ్‌(ప్రస్తుతం ఎస్‌బీఐ) అరండల్‌పేట బ్రాంచి నుంచి రూ.24.57 కోట్ల రుణం తీసుకున్నారు. ఆ నిధులను దారిమళ్లించిన పేరిరెడ్డి తన బంధువులు, ఉద్యోగుల పేరుతో 26 వ్యాపార సంస్థలు నిర్వహించారు. కార్మికులు, అకౌంటెంట్ల పేరుతో బ్యాంకు ఖాతాలు తెరిచి వాటి నుంచి రూ.23.81 కోట్లు పేరిరెడ్డి విత్‌డ్రా చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు

30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!

Updated Date - Nov 11 , 2026 | 05:04 AM