Share News

శివశంకర్‌రెడ్డికి ఈడీ నోటీసు

ABN , Publish Date - Oct 12 , 2026 | 04:24 AM

జగన్‌ బాబాయ్‌, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ కేసులో రూ.40 కోట్ల సుపారీ ఒప్పందం జరిగినట్లు సీబీఐ నిర్ధారించి చార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది.

శివశంకర్‌రెడ్డికి ఈడీ నోటీసు

  • వివేకా హత్య కేసులో నేడు విచారణకు

  • 40 కోట్ల సుపారీ గుట్టుపై నిశిత ప్రశ్నలు

  • వరుస విచారణలతో వైసీపీలో కలవరం

కడప, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): జగన్‌ బాబాయ్‌, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ కేసులో రూ.40 కోట్ల సుపారీ ఒప్పందం జరిగినట్లు సీబీఐ నిర్ధారించి చార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఆ రూ.40 కోట్ల మనీ ల్యాండరింగ్‌ గుట్టురట్టు చేసేందుకు పట్టు బిగించింది. ఆ డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి? ఎవరు ఇచ్చారు? ఎవరెవరికి ఇచ్చారు? ఎవరు సమకూర్చారు? ఎవరు హత్యకు రూపకల్పన చేశారు? నిందితులకు డబ్బు ఎలా చేరింది? వంటి వాటిపై ఈడీ ఫోకస్‌ పెట్టింది. తాజాగా ఈ కేసులో దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డిని ఈనెల 12వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.

ఇప్పటికే కేసు విచారణలో భాగంగా ఇప్పటికే ఈడీ అధికారులు అప్రూవర్‌గా మారిన డ్రైవరు దస్తగిరితోపాటు సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, ఎర్రగంగిరెడ్డిని విచారించారు. అవినాశ్‌ రెడ్డిని ఈనెల 14వ తేదీన విచారణకు హజరు కావాలని ఈడీ నోటీసు జారీ చేసింది. ఈ క్రమంలో శివశంకర్‌ రెడ్డి విచారణ కీలకంగా మారనుంది. కాగా.. ఈ హత్య కేసులో ఉన్న నిందితులు ఒక్కొక్కరినీ ఈడీ విచారిస్తుండడంతో వైసీపీలో కలవరం మొదలైంది.

ఈ వార్తలనూ చదవండి...

నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్

Updated Date - Oct 12 , 2026 | 04:24 AM