సస్పెండ్ చేశారు.. 20 రోజుల్లోనే ఎత్తేశారు..!
ABN , Publish Date - Oct 08 , 2026 | 04:49 AM
ఔషధ నియంత్రణ మండలి (డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్)లో ఉన్నతాధికారుల నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. జంగారెడ్డిగూడెంలో ఒక మెడికల్ షాపు అనుమతి వ్యవహారంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన ఉన్నతాధికారులు..
డ్రగ్ అధికారుల వివాదాస్పద నిర్ణయాలు
అమరావతి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): ఔషధ నియంత్రణ మండలి (డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్)లో ఉన్నతాధికారుల నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. జంగారెడ్డిగూడెంలో ఒక మెడికల్ షాపు అనుమతి వ్యవహారంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన ఉన్నతాధికారులు.. అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ), డ్రగ్ ఇన్‌స్పెక్టర్ (డీఐ)ను విధుల నుంచి తప్పించారు. కానీ ఈ చర్యలు చేపట్టి 20 రోజులైనా కాకముందే డీఐపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. మరో రెండు రోజుల్లో ఏడీపై సస్పెన్షన్‌ను కూడా తొలగించేందుకు సిద్ధమయ్యారు. ఏదైనా ఆరోపణలపై ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేస్తే దానిపై కనీస విచారణ జరిపించాలి. లేదంటే విచారణాధికారిని నియమించి.. సదరు విచారణలో ఆరోపణలు నిరూపణ కాకపోతే మాత్రమే సస్పెన్షన్‌ను తొలగించాలి. ఇవేమీ చేయకుండానే సస్పెన్షన్ తొలగిస్తున్నారు. పైగా ఎక్కడైతే సస్పెన్షన్ చేసారో.. వారిద్దరికీ మళ్లీ అదే స్థానంలో పోస్టింగ్ ఇస్తున్నారు. డీఐకి అక్కడే పోస్టింగ్ ఇచ్చారు. ఏడీకి కూడా అక్కడే పోస్టింగ్ ఇచ్చేందుకు ఫైల్ సిద్ధం చేశారు.
ఈ వార్తలనూ చదవండి..