Share News

‘నామ్‌స్కాన్‌ 2026’ న్యాయ నిర్ణేతగా డాక్టర్‌ కూటికుప్పల

ABN , Publish Date - Oct 06 , 2026 | 05:47 AM

ప్రముఖ వైద్యుడు, నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఇండియా) ఫెలో ప్రొఫెసర్‌ డాక్టర్‌ కూటికుప్పల సూర్యారావుకు అరుదైన గౌరవం లభించింది.

 ‘నామ్‌స్కాన్‌ 2026’ న్యాయ నిర్ణేతగా డాక్టర్‌ కూటికుప్పల

విశాఖపట్నం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ వైద్యుడు, నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఇండియా) ఫెలో ప్రొఫెసర్‌ డాక్టర్‌ కూటికుప్పల సూర్యారావుకు అరుదైన గౌరవం లభించింది. జాతీయ స్థాయిలో నిర్వహించే నేషనల్‌ మెడికల్‌ సైన్సెస్‌ 66వ వార్షిక సదస్సు (నామ్‌స్కాన్‌-2026)లో పరిశోధన ప్రదర్శనలకు న్యాయ నిర్ణేతగా ఆయన్ను ఆహ్వానించారు. ఈ నెల తొమ్మిది నుంచి 11వ తేదీ వరకు తమిళనాడులోని కట్టాంకులత్తూరులోని ఎస్‌ఆర్‌ఎం మెడికల్‌ కాలేజీలో ఈ సదస్సు జరగనుంది.

ఈ వార్తలనూ చదవండి:

ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్

ఏపీలో నాలుగు కొత్త పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

Updated Date - Oct 06 , 2026 | 05:47 AM