Share News

ఏఐబీవోడీఏ సలహాదారుగా డాక్టర్‌ సమరం

ABN , Publish Date - Sep 22 , 2026 | 06:15 AM

సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్‌ అండ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ అనుబంధంగా పనిచేస్తున్న అఖిల భారత శరీర అవయవ దాతల సంఘం ముఖ్య సలహాదారుగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ జి.సమరం నియమితులయ్యారు.

ఏఐబీవోడీఏ సలహాదారుగా డాక్టర్‌ సమరం

విజయవాడ(బెంజిసర్కిల్‌), సెప్టెంబరు 21, (ఆంధ్రజ్యోతి) : సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్‌ అండ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ అనుబంధంగా పనిచేస్తున్న అఖిల భారత శరీర అవయవ దాతల సంఘం ముఖ్య సలహాదారుగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ జి.సమరం నియమితులయ్యారు. ట్రస్ట్‌ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్‌ గూడూరు సీతామహాలక్ష్మి ఈ మేరకు నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు సంస్థ జాతీయ పర్యవేక్షకులు ఎస్‌.శ్రీనివాస్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే కృష్ణా జిల్లా అధ్యక్షురాలిగా జి.కనకదుర్గ, ఎన్‌టీఆర్‌ జిల్లా అధ్యక్షులుగా బి.మల్లేశ్వరరావు, సభ్యులుగా పి. చిదంబరం నియమితులయ్యారు.

ఈ వార్తలనూ చదవండి....

‘హామీల అమలుకు చర్యలు తీసుకోండి’

ఆర్‌వీ నగర్‌ కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్సవాలకు సీఎం రాక

Updated Date - Sep 22 , 2026 | 06:15 AM