వైసీపీ నిర్వాకంతోనే ఆలయాలకు భక్తుల సంఖ్య తగ్గింది: బుచ్చిరాంప్రసాద్
ABN , Publish Date - Oct 08 , 2026 | 06:14 AM
వైసీపీ ప్రభుత్వం నిర్వాకం వల్లే 2019-24 మధ్య ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పడిపోయిందని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాంప్రసాద్ అన్నారు.
అమరావతి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం నిర్వాకం వల్లే 2019-24 మధ్య ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పడిపోయిందని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాంప్రసాద్ అన్నారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘వైసీపీ హయాంలో దేవాలయాల భూముల పరిరక్షణను గాలికి వదిలేశారు. ఆలయాల నిర్వహణ గాడి తప్పింది. కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. రాష్ట్రంలోని 54 ప్రముఖ ఆలయాలకు భక్తులు గణనీయంగా పెరిగారు.
ఈ వార్తలనూ చదవండి..