Share News

నేడు కాకినాడలో సీఐఐ ప్రాంతీయ సదస్సు

ABN , Publish Date - Oct 12 , 2026 | 04:01 AM

ఉమ్మడి తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడం, పెట్టుబడులను ఆకర్షించే నేపథ్యంలో సోమవారం కాకినాడ జేఎన్‌టీయూలో సీఐఐ ప్రాంతీయ భాగస్వామ్య సదస్సు నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశారు.

నేడు కాకినాడలో సీఐఐ ప్రాంతీయ సదస్సు

  • ముఖ్యఅతిథిగా హాజరుకానున్న డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌

కలెక్టరేట్‌(కాకినాడ), అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడం, పెట్టుబడులను ఆకర్షించే నేపథ్యంలో సోమవారం కాకినాడ జేఎన్‌టీయూలో సీఐఐ ప్రాంతీయ భాగస్వామ్య సదస్సు నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.40 గంటల వరకు సదస్సు జరగనుంది. ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ హాజరుకానున్నారు. అలాగే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి టీజీ భరత్‌, ఆర్‌అండ్‌బీ, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులశాఖ మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి, దేశ నలుమూలల నుంచి పెద్దఎత్తున పారిశ్రామిక వేత్తలు, పరిశ్రమల నిపుణులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు విచ్చేస్తున్నారు. ఏర్పాట్లను ఏపీ ఆర్థికాభివృద్ధి సంస్థ సీఈవో ఎస్‌.షాన్‌మోహన్‌ ఆదివారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఐదు జిల్లాల కలెక్టర్లు, ప్రముఖ కంపెనీల ప్రతినిధులు, ఎంఎస్ఎంఈ ప్రతినిధులు సదస్సులో పాల్గొంటారు.

ఈ వార్తలనూ చదవండి...

నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్

Updated Date - Oct 12 , 2026 | 04:01 AM