జనసేన చాలా త్యాగం చేసింది..
ABN , Publish Date - Oct 12 , 2026 | 03:41 AM
2014లో కూటమి కోసం నిలబడాల నుకున్నాం. చిన్న కార్పొరేటర్ గానీ, కౌన్సిలర్ గానీ.. ఒక్క పదవి కూడా తీసుకోలేదు. నేనెవ్వరినీ అడగలేదు. కానీ మా వాళ్లందరూ కూటమి కోసం కష్టపడి పనిచేశారు.
ఈసారి మాకు ప్రాధాన్యమివ్వాలి
చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు
ఎవరూ రోడ్డుపైకి రాలేదు
జనసైనికులు, వీర మహిళలే రోడ్ల మీదకువచ్చి రాష్ట్రానికి ధైర్యం, భరోసా ఇచ్చారు
ఈ ఎన్నికల్లో వారికి తగిన ప్రాతినిధ్యమివ్వాలి
కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషిచేయాలి: పవన్
రాజమహేంద్రవరం, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): 2014లో కూటమి కోసం నిలబడాల నుకున్నాం. చిన్న కార్పొరేటర్ గానీ, కౌన్సిలర్ గానీ.. ఒక్క పదవి కూడా తీసుకోలేదు. నేనెవ్వరినీ అడగలేదు. కానీ మా వాళ్లందరూ కూటమి కోసం కష్టపడి పనిచేశారు. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో ప్రాధాన్యమివ్వాలి’ అని జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
స్పష్టంచేశారు. పోలవరం జిల్లా రంపచోడవరం మండలంలో దట్టమైన అటవీ ప్రాంతమైన కాకవాడ గ్రామంలో ఆదివారం ఆయన పర్యటించారు. రూ.2,055 కోట్లతో అడవితల్లి బాట 2.0కు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘రాజకీయాల్లో ఎలా ఉంటుంది?. ఏదైనా పదవి అడుగుతారు. కానీ 2014లో నేను ఒక్క పదవీ అడగలేదు. నా దేశం, నేల, ఆంధ్రప్రదేశ్ బాగుండాలని కోరుకున్నాను. నా మనుషులు బాగుండాలని కోరుకున్నాను. జనసైనికులు, వీరమహిళలు నా మాటకు కట్టుబడి ఉంటారు. అందుకే నాకు వారంటే అంత గౌరవం. ఈసారి స్థానిక ఎన్నికల్లో ఒకటే అడుగుతున్నాను.
జనసైనికులు అందరూ పొత్తు ప్రకారం పోటీచేస్తారు.. తెలుగుదేశం, బీజేపీకి ఎంత ప్రాతినిధ్యం, గౌరవం ఇస్తారో.. మా వాళ్లకు అంతే మద్దతివ్వాలి. 2023లో చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు.. జనసైనికులు, వీరమహిళలు రోడ్డుపైకి వచ్చి ధైర్యాన్ని, భరోసాను ఈ రాష్ట్రానికిచ్చారు. పోయిన ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్ కోసం, ఈ స్థానిక ఎన్నికలు మీ భవిష్యత్ కోసం, స్థానిక అవసరాల కోసం చేస్తాను. మూడు పార్టీలు బాగుండాలి. జనసేన చాలా త్యాగం చేసింది. ఈసారి మా జనసైనికులు, వీరమహిళలకు తగిన ప్రాతినిధ్యం ఇచ్చేవిధంగా ప్రతి నాయకుడూ అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని తెలిపారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు అండగా నిలిచి కూటమి విజయానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషిచేయాలని పిలుపిచ్చారు.
ఈ వార్తలనూ చదవండి...
నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్