Share News

ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ప్రాధాన్యమివ్వండి: పవన్‌

ABN , Publish Date - Sep 24 , 2026 | 05:02 AM

భారీ వర్షాల నేపథ్యంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఆదేశించారు.

ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ప్రాధాన్యమివ్వండి: పవన్‌

అమరావతి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): భారీ వర్షాల నేపథ్యంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఆదేశించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యమివ్వాలన్నారు. పునరావాస శిబిరాల నిర్వహణలో పాల్గొనాలన్నారు. రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో పునరుద్ధరణ కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు. పునరావాస శిబిరాల్లో ఆహారం, రక్షిత తాగునీరు, మందులు, ఇతర మౌలిక సదుపాయాలు ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. పశువులు, ఇతర మూగజీవాలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు.

Updated Date - Sep 24 , 2026 | 05:02 AM