Share News

దాల్మియాకు 250 ఎకరాలు

ABN , Publish Date - Sep 27 , 2026 | 05:18 AM

కడప జిల్లా మైలవరం మండలం చిన్నకొమెర్ల గ్రామంలో మెస్సర్స్‌ దాల్మియా సిమెంట్స్‌(భారత్‌)కు ప్రభుత్వం 250 ఎకరాలు కేటాయించింది. ప్రస్తుతం ఉన్న సిమెంట్‌ పరిశ్రమలను విస్తరించేందుకు ఈ భూములు కేటాయించినట్లుగా..

 దాల్మియాకు 250 ఎకరాలు

  • చిన్నకొమెర్లలో సిమెంట్‌ ఉత్పత్తి పెంపునకు ఆమోదం

అమరావతి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): కడప జిల్లా మైలవరం మండలం చిన్నకొమెర్ల గ్రామంలో మెస్సర్స్‌ దాల్మియా సిమెంట్స్‌(భారత్‌)కు ప్రభుత్వం 250 ఎకరాలు కేటాయించింది. ప్రస్తుతం ఉన్న సిమెంట్‌ పరిశ్రమలను విస్తరించేందుకు ఈ భూములు కేటాయించినట్లుగా పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌ శనివారం జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఏటా 3.6 మెట్రిక్‌ టన్నుల సిమెంటు ఉత్పత్తి అవుతుండగా, దానికి 9.60 మెట్రిక్‌ టన్నులు పెంచేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2028 జనవరి నాటికి గరిష్ఠస్థాయిలో ఏటా 9.60 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంటుందని, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి జీఎస్టీ ద్వారా మరింత ఆదాయం వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు

పర్యాటకం జోరు

Updated Date - Sep 27 , 2026 | 05:42 AM