Share News

14 జిల్లాల్లో సహాయక బృందాలు

ABN , Publish Date - Oct 28 , 2026 | 06:00 AM

ఆర్నబ్‌ తుఫాన్‌పై రాష్ట్ర ప్రభు త్వం పూర్తి అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. తుఫాన్‌ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు వివిధ శాఖలు చేపట్టిన ముందస్తు సన్నద్ధత చర్యలను సీఎం చంద్రబాబు, ఆర్టీజీఎస్‌ మంత్రి లోకేశ్‌, హోంమంత్రి అనిత నిరంతరం సమీక్షిస్తున్నారు.

 14 జిల్లాల్లో సహాయక బృందాలు

  • తుఫానుపై నిరంతరం సమీక్షిస్తున్న సీఎం చంద్రబాబు

అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): ఆర్నబ్‌ తుఫాన్‌పై రాష్ట్ర ప్రభు త్వం పూర్తి అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. తుఫాన్‌ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు వివిధ శాఖలు చేపట్టిన ముందస్తు సన్నద్ధత చర్యలను సీఎం చంద్రబాబు, ఆర్టీజీఎస్‌ మంత్రి లోకేశ్‌, హోంమంత్రి అనిత నిరంతరం సమీక్షిస్తున్నారు. అత్యవసర సహాయక చర్యల కోసం 14 జిల్లాలకు 12 ఎన్డీఆర్‌ఎఫ్‌, 10 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను మోహరించారు. ప్రజల మొబైల్‌ ఫోన్లకు నిరంతరం తుఫాన్‌ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు 1,087 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. 1,351 మంది గర్భిణీలను ఆసుపత్రులకు తరలించారు. ప్రజలకు నిత్యావసరాలకు కొరత తలెత్తకుండా సరుకులను నిల్వ చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

తీరం దాటుతున్న ఆర్నబ్ తుఫాన్..!

ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Updated Date - Oct 28 , 2026 | 06:00 AM