‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’
ABN , Publish Date - Nov 13 , 2026 | 04:37 AM
‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ వెల్లడించిన ఓట్ల గోల్‌మాల్‌కు సంబంధించిన నివేదికలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ డిమాండ్ చేసింది.
నివేదికలపై విచారించాలి: సీపీఐ
అమరావతి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ వెల్లడించిన ఓట్ల గోల్‌మాల్‌కు సంబంధించిన నివేదికలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ డిమాండ్ చేసింది. కేంద్ర ఎన్నికల కమిషన్ వద్దనున్న అంతర్గత నివేదికలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేసింది ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ సంస్థ పరిశోధనాత్మక జర్నలిజం ద్వారా సేకరించిన సమాచారాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు.
సుప్రీం కోర్టు కూడా ఈ అంశంలో స్పందిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం విజయవాడలోని దాసరి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్యతో కలసి ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మరోసారి దేశవ్యాప్త పోరాటానికి సిద్ధమవుతున్నామని చెప్పారు. ఈనెల 16, 17 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించనున్న సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ అంశంపై చర్చించి కార్యాచరణ రూపొందించనున్నట్లు వివరించారు.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం
ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు