Share News

క్వాంటమ్‌ వ్యాలీకి కంపెనీల జోష్‌

ABN , Publish Date - Oct 06 , 2026 | 04:50 AM

అమరావతి క్వాంటమ్‌ వ్యాలీకి కంపెనీలు క్యూ కడుతున్నాయి. తాజాగా క్వాంటమ్‌ హార్డ్‌వేర్‌, హెల్త్‌కేర్‌ రిసెర్చ్‌ సెంటర్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ సంస్థలు పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టనున్నాయి. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన కంపెనీల వివరాలు ఇలా...

క్వాంటమ్‌ వ్యాలీకి కంపెనీల జోష్‌

అమరావతి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): అమరావతి క్వాంటమ్‌ వ్యాలీకి కంపెనీలు క్యూ కడుతున్నాయి. తాజాగా క్వాంటమ్‌ హార్డ్‌వేర్‌, హెల్త్‌కేర్‌ రిసెర్చ్‌ సెంటర్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ సంస్థలు పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టనున్నాయి. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన కంపెనీల వివరాలు ఇలా...

ట్రైక్వాంటా లాబ్స్‌ హైబ్రీడ్‌ కంప్యూటింగ్‌ హార్డ్‌వేర్‌ : స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన హైబ్రీడ్‌ క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ హార్డ్‌వేర్‌ (టీక్యూఎన్‌సీ-60ఐ)తో కార్యకలాపాలు చేపడుతుంది. రూ.35 కోట్లు పెట్టుబడి పెడుతుంది. 175 మందికి ఉద్యోగాలు దక్కుతాయి.

క్వాంటమ్‌ కోడన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ : ఈ సంస్థ నెక్స్ట్‌ జనరేషన్‌ డ్రగ్స్‌, మాలిక్యులర్‌ బయాలజీ రీసెర్చ్‌, బయోఅనలిటికల్‌/సీఆర్‌ఓ పరిశోధనలు చేపడుతుంది. పెట్టుబడి రూ.167 కోట్లు. 126 మందికి ఉద్యోగాలు వస్తాయి.

క్వాన్‌ఫ్లుయెన్స్‌: ఈ సంస్థ క్వాంటమ్‌ ఆప్టిమైజేషన్‌ ప్లాట్‌ఫాంను అభివృద్ధి చేస్తుంది. క్వాంటమ్‌ రాండమ్‌ నంబర్‌ జనరేటర్లు, క్వాంటమ్‌ సెక్యూరిటీ సొల్యూషన్లు తయారు చేస్తుంది. రూ.5 కోట్ల పెట్టుబడితో 30 మంది ఉద్యోగాలు కల్పిస్తుంది.

ఎస్‌ఆర్‌ఎస్‌టీఐ క్వాంటమ్‌: ఈ సంస్థ డీప్‌టెక్‌ టెక్నాలజీ రిసెర్చ్‌, డెవల్‌పమెంట్‌, అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ సదుపాయాలు కల్పిస్తుంది. రూ.100 కోట్లు పెట్టుబడి. 500మందికి ఉద్యోగాలు వస్తాయి.

వేరిడేటా హెల్త్‌ ఐఎన్‌సీ: ఈ సంస్థ గ్లోబల్‌ ఇంజనీరింగ్‌ హబ్‌ను అభివృద్ధి చేస్తుంది.

ఆరోహక్‌ టెక్నాలజీస్‌: ఈ సంస్థ పోస్ట్‌ క్వాంటమ్‌ సైబర్‌ సెక్యూరిటీ, ఫోటోనిక్‌ టెక్నాలజీస్‌లో ప్రఖ్యాతిగాంచింది. రూ.62కోట్ల పెట్టుబడి.300మందికి ఉద్యోగాలు వస్తాయి.

ఫోటాన్‌కోర్‌ సిస్టమ్‌: ఫోటాన్‌క్యూ రంగంలో అనుభవం ఉంది. 9కోట్ల పెట్టుబడి.45 మందికి ఉద్యోగాలు.

ఈ వార్తలనూ చదవండి:

ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్

ఏపీలో నాలుగు కొత్త పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

Updated Date - Oct 06 , 2026 | 04:53 AM