Share News

అన్నదాతల ఆత్మహత్యలకు ఫుల్‌స్టాప్‌

ABN , Publish Date - Feb 28 , 2026 | 04:47 AM

రాష్ట్రంలో ఏ ఒక్క రైతూ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాకూడదు. ప్రతి రైతుకూ అండగా ఉంటాం’ అని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు....

అన్నదాతల ఆత్మహత్యలకు ఫుల్‌స్టాప్‌

  • నూతన పాలసీ తెస్తాం.. అండగా ఉంటాం.. కౌలు రైతులనూ ఆదుకుంటాం

  • అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి

అమరావతి, ఫిబ్రవరి27(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో ఏ ఒక్క రైతూ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాకూడదు. ప్రతి రైతుకూ అండగా ఉంటాం’ అని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. రైతుల ఆత్మహత్యలను ఆపే పాలసీని తెస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు. ‘ఒక్కోసారి కౌలురైతులు ఊహించిన దాని కంటే ఎక్కువగా 30-40 ఎకరాలు వేస్తున్నారు. దీనివల్ల నష్టం వస్తోంది. కౌలురైతుల్ని కూడా ఆదుకునేందుకు ఎంతవరకు చేయాలో అంత వరకు చేస్తాం. అయితే, వాళ్లలో కూడా పరిమితులు పెట్టుకుని చేస్తే చాలా బాగుంటుంది‘ అని సూచించారు. శుక్రవారం శాసనసభలో వ్యవసాయ అనుబంధ రం గాలపై సీఎం ప్రసంగించారు. ‘వ్యవసాయం పెద్ద ఎత్తున సాగు చేసే రాష్ట్రం మనది. ఈ ఏడాది దేశ వ్యవసాయ వృద్ధి రేటు 0.39శాతం ఉండగా, అదే మన రాష్ట్రంలో 7.83 శాతం ఉంది. వ్యవసాయంలో దేశ జీడీపీలో 10శాతం విరాళంగా ఇచ్చే ఏకైక రాష్ట్రం మనది. గత ఐదేళ్లలో వ్యవసాయ రంగంలో అన్ని విధాలా నష్టపోయాం. అందుకే స్వర్ణాంధ్ర 10 సూత్రాల్లో వ్యవసాయ విధానం తెచ్చాం. ఇంకో వైపు రైతన్నను ముందుకు తీసుకెళ్లడానికి పంచ సూత్రా లు పెట్టుకున్నాం. ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు లేకపోతే.. కొన్ని పంటల్లో చాలా నష్టపోయే పరిస్థితి వస్తుంది. వ్యవసాయంలో సంక్షోభం వచ్చినప్పుడు ఆదుకునేలా రైతులకు ప్రభుత్వ మద్దతు ఉండాలి. ఇందుకోసం సాంకేతిక త వాడాలి. రాష్ట్రంలో 22.5 లక్షల వ్యవసాయ పంపు సెట్లు పని చేస్తున్నాయి. ఈ ఏడాది 69వేల కనెక్షన్లు అదనంగా ఇచ్చాం. వ్యవసాయానికి రూ.13,722కోట్లు 2025-26లో వ్యవసాయ ఉచిత విద్యుత్‌కు కేటాయిం చాం. ఈ ఏడాది మైక్రో న్యూట్రిన్స్‌ 1,250 టన్నులు సరఫరా చేశాం. ‘అన్నదాత సుఖీభవ’ కింద రూ.20 వేలు ఇస్తామని ఎన్డీయే తరఫున చెప్పాం. దీనిపై ఎవరైతే విమర్శిస్తున్నారో.. వారు ఏడాదికి రూ.7,500 ఇస్తే, ఈరోజు ప్రభుత్వం రూ.14వేలు ఇస్తోంది. నాడు రైతులకు డుబ్బులిస్తున్నామని చెప్పి.. మిగిలి న రాయితీలన్నీ కట్‌ చేశారు. వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక 47 లక్షల మందికి ఇన్‌పుట్‌ సబ్సిడీగా రూ.310 కోట్లు ఇచ్చాం. ఽఇవి కాకుండా రూ.1,670కోట్ల బకాయిలు పెట్టి పోతే ఆ బకాయిలూ చెల్లించాం. గత ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువ జరిగాయి.


నీరు చాలా ముఖ్యం..

‘నేనిక్కడి నుంచి ఎమ్మెల్యేలు, ప్రజలను ఒక్క టే కోరుతున్నా.. నీరు అనేది చాలా ముఖ్యం. నిరుడు 3-4శాతం అదనపు వర్షపాతం వచ్చింది. ఈ ఏడాది కొద్దిగా ఇబ్బంది ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. నీటిని కాపాడుకోవడం మన బాధ్యత.’ అని సీఎం అన్నారు. ‘అన్నమయ్య జి ల్లాలో సమర్థనీటి నీటి నిర్వహణ చేశారు. 2024 నవంబరులో 12.97 మీటర్లు నీటి మట్టం లోతు ఉండేది. గత జనవరిలో 6.67 మీటర్లకు వచ్చిం ది. ఒక్క ఏడాదిలో సమర్థ నీటి నిర్వహణ వల్ల 6.3 మీటర్లు భూగర్భ జలాలు పెరిగాయంటే అదొక చరిత్ర. దీనికి కృషి చేసిన జిల్లా పరిపాలన యంత్రాంగాన్ని అభినందిస్తున్నా. రాష్ట్రంలో సగటున 7.31 మీటర్ల లోతులో భూగర్భ జలాలున్నాయి. భూగర్భ జలాలు పెరిగినందున 2024 లో 336 మిలియన్‌ యూనిట్లు విద్యుత్‌ వాడితే.. 2025లో 221 మిలియన్‌ యూనిట్లు మాత్రమే వాడారు. దీనివల్ల 115 మిలియన్‌ యూనిట్ల ఆదాతో రూ.95కోట్లు ఆదా అయ్యాయి. మనం సమర్థవంతంగా పని చేస్తే.. ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇదోక ఉదాహరణ. దీనికి అనదంగా 20వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు పెరిగాయి. దీని విలువ రూ.1,634కోట్లు. రైతులందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా.. ఎక్కడికక్కడ అవసరమైన మెకానిజం పెట్టాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వం అండగా ఉంటుంది.’ అన్నారు.

ఖరీఫ్‌‌ను ముందుకు తేవాలి.. ఎమ్మెల్యే బాధ్యత!

సుదీర్ఘ సముద్ర తీరప్రాంత రాష్ట్రంలో తుఫాన్ల నుంచి పంటను కాపాడుకోవాలంటే ఖరీ్‌ఫను రెండు నెలలు ముందుకు తీసుకు రావల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉందని మంత్రి అచ్చెన్న చెప్పారు. తమ నియోజకవర్గాల్లోని రైతులతో చర్చించి నారు ముందుగా వేసుకునేలా, కేన్సర్‌కు కారణం అవుతున్న యూరియా వాడకం తగ్గించేందుకు ఒప్పించాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌గా తీర్చిదిద్దబోతోందని స్పష్టం చేశారు. సీమ బిడ్డగా ప్రతిచోటా చెప్పుకునే జగన్‌ సీమలో డ్రిప్‌ ఇరిగేషన్‌, స్పింక్లర్లను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు.

Updated Date - Feb 28 , 2026 | 04:47 AM