శ్రీకాకుళంలో డయేరియా అంశంపై సీఎం చంద్రబాబు సమీక్ష..
ABN , Publish Date - Feb 24 , 2026 | 09:44 PM
శ్రీకాకుళంలో కలకలం సృష్టిస్తున్న డయేరియా అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ విషయంపై జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు..
అమరావతి, ఫిబ్రవరి 24: శ్రీకాకుళంలో కలకలం సృష్టిస్తున్న డయేరియా అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ విషయంపై జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. డయేరియా బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు. మంగళవారం ఈ ఘటనపై వేర్వేరుగా రెండుసార్లు జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో అందుతున్న వైద్యంపై ఆరా తీశారు.
శ్రీకాకుళం నగరంలో రోడ్డు మరమ్మతుల పనుల కారణంగా డయేరియా వ్యాపించిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ఘటనలో మొత్తం 65 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, ప్రస్తుతం వారికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఇవి కూడా చదవండి..
మాజీ మంత్రి మల్లారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..
కొత్త పార్టీని ప్రకటించిన శశికళ